OTT Movie : ఓటీటీలో డిఫరెంట్ స్టోరీలతో సినిమాలు వస్తూనే ఉన్నాయి. అయితే కొన్ని స్టోరీలు ఆలోచనలో పడేస్తుంటాయి. ఊహించడానికి కూడా కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అటువంటి విచిత్రమైన స్టోరీ ఒకటి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ స్టోరీలో కూతురి బాయ్ ఫ్రెండ్ తో తల్లి సన్నిహితంగా మెలుగుతుంది. ఆతరువాత స్టోరీ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
1990లలో హిమాలయన్ కొండల్లోని ఒక పేరు పొందిన బోర్డింగ్ స్కూల్‌లో, మీరా అనే 16 ఏళ్ల అమ్మాయి చదువుకోవడానికి వెళ్తుంది. మీరా తన స్కూల్‌లో మొట్టమొదటి అకడమిక్ ఉత్తమమైన విద్యార్థినిగా ఎంపికవుతుంది . ఆమె స్కూల్ నియమాలను కఠినంగా పాటిస్తుంటుంది. కానీ ఆమెకు వయసులో వుండే కోరికల వైపు ఆసక్తి పెరుగుతుంది. ఇక ప్రేమలో పాడాలని అనుకుంటుంది. ఈ సమయంలో మీరాకి శ్రీనివాస్ అనే కొత్త విద్యార్థి పరిచయమవుతాడు. అతను అందరితో చాలా సరదాగా ఉంటాడు. అయితే వీళ్ళిద్దరూ ఒకరిపై ఒకరు ఇష్టం పెంచుకుంటారు. మీరా తనలో దాగివున్న ప్రేమను అతనితో పంచుకుంటుంది. కానీ స్కూల్‌లోని కఠినమైన నియమాలు, ఆమెకు ఇబ్బందికారంగా మారుతాయి.
ఈ సమయంలో మీరా తల్లి అనిలా హరిద్వార్ నుండి వచ్చి, మీరా పరీక్షల సమయంలో స్కూల్ కి సమీపంలో ఉండటానికి ఒక ఇంటిని అద్దెకు తీసుకుంటుంది. అనిలా యవ్వనంలో తన కలలను సాకారం చేసుకోలేకపోయింది.
ఇప్పుడు భర్త లేకపోవడంతో అనిలా ఒంటరిగానే ఉంటోంది. శ్రీనివాస్ మీరా ఇంటికి వచ్చినప్పుడు, అనిలా అతనితో సన్నిహతంగా మెలగడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇది మీరాకు ఇబ్బందికారంగా అనిపిస్తుంది. మరో వైపు స్కూల్‌లో మీరా లీడర్ గా తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి కష్టపడుతుంది. ఈ క్రమంలో కొంతమంది అబ్బాయిలు ఆమెను హేళన చేస్తారు. ఆమె దుస్తుల పట్ల కొంతమంది అసభ్యంగా ప్రవర్తిస్తారు. అందుకు యాజమాన్యం తననే నిందిస్తుంది. లీలా తన తల్లితో, స్కూల్ విద్యార్థులతో ఇబ్బందులను ఎదుర్కుంటుంది. చివరికి మీరా ఈ సమస్యలను ఎలా ఎదుర్కుంటుంది ? తన బాయ్ ఫ్రెండ్ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : అమ్మాయిలను ఏంజెల్ రూపంలో చంపే సైకో… పోలీసులకే చుక్కలు చూపించే క్రైమ్ కథా చిత్రమ్
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో
ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘గర్ల్స్ విల్ బీ గర్ల్స్’ (Girls Will be girls). 2024 లో వచ్చిన ఈ సినిమాకి శుచి తలాటి దర్శకత్వం వహించారు. ఈ స్టోరీ హిమాలయన్ కొండలలో ఉండే ఒక బోర్డింగ్ స్కూల్‌లో జరుగుతుంది. ఈ సినిమాలో ప్రీతి పాణిగ్రహి, కాని కుసృతి, కేసవ్ బినాయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ 2024 సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెండు అవార్డులను గెలుచుకుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది.