E-Paper
Advertisement

RITES Recruitment: డిగ్రీ, పాలిటెక్నిక్ అర్హతలతో ఉద్యోగాలు.. మంచి వేతనం.. రేపే లాస్ట్ డేట్

RITES Recruitment: డిగ్రీ, పాలిటెక్నిక్ అర్హతలతో ఉద్యోగాలు.. మంచి వేతనం.. రేపే లాస్ట్ డేట్
Advertisement

RITES Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. మెటలాజికల్, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో డిగ్రీ, మెకానికల్, సివిల్ విభాగాల్లో డిప్లొమా పాసైన అభ్యర్థులకు గుడ్ న్యూస్. రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగంలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు గౌరవప్రదమైన జీతం కూడా కల్పించనున్నారు.

ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన గుడ్‌గావ్‌లోని రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ లిమిటెడ్‌(RITES) ఖాళీగా ఉన్న రెసిడెంట్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకీ అధికారులు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మార్చి 11 న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు పెట్టుకోవచ్చు. అంటే రేపటితోనే దరఖాస్తు ప్రక్రియకు గడువు ముగియనుంది. ఒకసారి నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.

Advertisement

ALSO READ: Assam Rifles: టెన్త్, ఇంటర్ అర్హతతో 215 ఉద్యోగాలు.. దరఖాస్తు లాస్ట్ డేట్ ఎప్పుడంటే..?

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 54

Advertisement

రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ లిమిటెడ్‌ లో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో రెసిడెంట్ ఇంజినీర్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.

దరఖాస్తు ప్రక్రియకు చివరి తేది: 2025 మార్చి 11

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ(మెటలాజికల్, మెకానికల్ ఇంజినీరింగ్), డిప్లొమా(మెకానికల్, సివిల్‌)లో పాసై ఉంటే సరిపోతుంది. వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.

వయస్సు: 2025 మార్చి 11 నాటికి 40 ఏళ్ల వయస్సు మించరాదు. వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది

దరఖాస్తు ప్రక్రియ: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఫీజు చెల్లించి అప్లికేషన్ పెట్టుకోవాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.100 ఫీజు ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

వేతనం: ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు రూ.23,340 జీతం ఉంటుంది.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.rites.com/

అర్హత ఉన్న అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు రూ.23,340 జీతం ఉంటుంది.  వెంటనే ఈ జాబ్ కు దరఖాస్తు పెట్టుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

ALSO READ: BEL Recruitment: బెల్‌లో ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే రూ.1,20,000 జీతం.. రేపే లాస్ట్ డేట్

ముఖ్యమైనవి:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 54

దరఖాస్తుకు చివరి తేది: మార్చి 11

వేతనం: నెలకు రూ.23,340 ఉంటుంది.

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×