NHAI Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఢిల్లీ, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానంలో 60 డిప్యూటీ మేనేజర్ ఖాళీల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్ 9వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 60
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఇందులో డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
పోస్టులు – ఖాళీలు:
డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్) : 60 పోస్టులు
కేటగిరీ వారీగా పోస్టులు..
యూఆర్: 27 పోస్టులు
ఎస్సీ: 9 పోస్టులు
ఓబీసీ: 13 పోస్టులు
ఈడబ్ల్యూఎస్: 7 పోస్టులు
విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది. వ్యాలిడ్ గేట్ స్కోర్-2025 ఉండాలి.
దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 9
వేతనం: ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం ఉంటుంది. నెలకు రూ.56,100 నుంచి రూ.1,77,500 వరకు వేతనం ఉంటుంది.
వయస్సు: 30 ఏళ్ల వయస్సు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, గేట్ స్కోర్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://nhai.gov.in/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగంలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం కూడా ఉంటుంది. నెలకు రూ.56,100 నుంచి రూ.1,77,500 వరకు వేతనం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
Also Read: NLC Recruitment: ఎన్‌ఎల్‌సీలో భారీగా ఉద్యోగాలు.. ఈ అర్హతలు ఉంటే చాలు.. జీతం మాత్రం రూ.1,00,000
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 60
దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 9
జీతం: నెలకు రూ.56,100 నుంచి రూ.1,77,500 వరకు ఉంటుంది.
Also Read: AFMS Jobs: ఆర్మ్ డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్‌లో భారీగా జాబ్స్.. 2 రోజులే ఛాన్స్