BigTV English

Cannes 2025 : కాస్త పద్దతి పాడు ఉండాలి… హీరోయిన్ల డ్రెస్‌లపై కేన్స్ షాకింగ్ స్టేట్మెంట్

Cannes 2025 : కాస్త పద్దతి పాడు ఉండాలి… హీరోయిన్ల డ్రెస్‌లపై కేన్స్ షాకింగ్ స్టేట్మెంట్

Cannes 2025 : కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులు ఈవెంట్ స్టార్ట్ కావడానికి ఒకరోజు ముందు ఓ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. డీసెన్సీ పేరుతో ఈసారి నటీనటులకు డ్రెస్ కోడ్ విషయంలో స్ట్రిక్ట్ రూల్స్ పెట్టింది. అందులో భాగంగా హీరోయిన్లు, హీరోలు ఈసారి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కొన్ని రకాల డ్రెస్ లు వేసుకోవడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. అంతేకాదు ఒకవేళ ఎవరైనా ఆ రూల్స్ ను గనుక అతిక్రమిస్తే, నో ఎంట్రీ అంటూ కుండబద్దలు కొట్టింది. ఇంతకీ కేన్స్ ఎలాంటి డ్రెస్ లను బ్యాన్ చేసింది? కొత్త రూల్స్ ఏంటి? అనే విషయంలోకి వెళ్తే…


ఆ డ్రెస్ లు వేసుకోవడానికి వీల్లేదు
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 ఈవెంట్ నిర్వాహకులు రెడ్ కార్పెట్‌పై అసభ్యకరమైన డ్రెస్ లు, పొడవైన ట్రెయిన్‌లను నిషేధించింది. పెద్ద ట్రెయిన్‌లతో కూడిన విశాలమైన గౌన్‌లు, ఒళ్ళు మొత్తం కన్పించే బట్టలు వేసుకోకూడదని కొత్త రూల్స్ పెట్టారు. ఒకరకంగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అంటే హీరోయిన్లు వేసుకునే బట్టలే మెయిన్ హైలెట్. అయితే కొంతమంది మరీ హద్దు మీరి బట్టలు ఒంటిపై ఉన్నాయా లేదా అన్నట్టు వేసుకోవడం, మరికొంత మంది అసలు వేసుకోకపోవడం కేన్స్ పై విమర్శలు వెల్లువెత్తేలా చేసింది. ఇక ఈ రకమైన దుస్తులు రెడ్ కార్పెట్‌పై అతిథుల రాకపోకలకు అడ్డుగా మారుతున్నాయని, థియేటర్‌లో సీటింగ్‌ కు కూడా ఇబ్బందిగా మారుతున్నాయని ఈవెంట్ నిర్వాహకులు పేర్కొన్నారు.

కేన్స్ కొత్త డ్రెస్ కోడ్ రూల్స్
గ్రాండ్ థియేటర్ లూమియర్ గాలా స్క్రీనింగ్‌ కోసం (సాయంత్రం 7 మరియు 10 గంటల సమయంలో జరిగే స్క్రీనింగ్‌లు, చిత్ర బృందాలు హాజరయ్యే వేడుకలు) అబ్బాయిలు డిన్నర్ జాకెట్ (టక్సీడో), బోటై ధరించాలి. అమ్మాయిలైతే ఈవెనింగ్ గౌన్ ధరించాలి. లేదంటే కాక్‌టెయిల్ డ్రెస్, డార్క్ ట్రౌజర్ సూట్, బ్లాక్ ట్రౌజర్స్‌ తో డ్రెస్సీ టాప్, బ్లాక్ డ్రెస్, లేదా బ్లాక్/మిడ్‌నైట్ బ్లూ సూట్‌తో బో టై ధరించవచ్చు.
స్టైలిష్ షూస్ (హీల్స్‌తో లేదా లేకుండా) తప్పనిసరి. కానీ స్పోర్ట్స్ షూస్ వేస్తే నో ఎంట్రీ.
అసభ్యకరంగా ఉండే బట్టలు రెడ్ కార్పెట్‌పై లేదా ఫెస్టివల్ కు సంబంధించిన ఏ ఇతర ప్రాంతంలోనూ అనుమతించబడవు.
బ్యాక్‌ప్యాక్‌లు, టోట్ బ్యాగ్‌లు లేదా పెద్ద బ్యాగ్‌లు తీసుకురావడం నిషేధం.


కేన్స్ నిర్ణయం ఎఫెక్ట్
క్రియేటివిటీ పేరుతో వేసే అసభ్యకర బట్టలు ఫెస్టివల్ ప్రతిష్టాత్మక ఇమేజ్‌కు విరుద్ధంగా ఉన్నాయని కేన్స్ నిర్వాహకులు భావిస్తున్నారు. కానీ ఈ రూల్స్ కొంతమంది స్టార్స్ కు ఇబ్బందిగా మారవచ్చు. ముఖ్యంగా గతంలో బెల్లా హదీద్, ఎల్సా హోస్క్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ వంటి వారు ధరించిన విశాలమైన గౌన్‌లు లేదా షీర్ దుస్తులు ఈ సంవత్సరం కష్టమే. గతంలో బెల్లా హదీద్ షీర్, న్యూ*డ్ గౌన్‌లతో రెడ్ కార్పెట్‌పై సంచలనం సృష్టించింది. కొత్త రూల్ నేపథ్యంలో రెడ్ కార్పెట్ ఫ్యాషన్‌ లో సంచలనాత్మక లుక్స్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన కొంతమంది సెలబ్రిటీల లుక్స్ ఈసారి రిపీట్ అయ్యే ఛాన్స్ లేదు. మడోన్నా (1991లో జీన్ పాల్ గౌటియర్ కోన్ బ్రా లుక్), ఇలోనా స్టాలర్ (1988లో ట్రాన్స్‌పరెంట్ డ్రెస్), బెల్లా హదీద్ (2021లో షియాపరెల్లి చెస్ట్‌లెస్ గౌన్) వంటి వారు ధరించిన బోల్డ్ లుక్స్ ఈసారి ఉండబోవన్న మాట.

గత వివాదాలు
కేన్స్ ఫెస్టివల్ డ్రెస్ కోడ్ గతంలో కూడా వివాదాస్పదమైంది. 2015లో హై హీల్స్ ధరించని సెలబ్రిటీలను ఫెస్టివల్ లోకి అడుగు పెట్టనివ్వలేదు అనే వివాదం సంచలనం రేపింది. దీనిపై నిరసనగా 2016లో జూలియా రాబర్ట్ బేర్‌ఫుట్‌ తో రెడ్ కార్పెట్‌పై నడిచారు. అలాగే 2018 లో క్రిస్టెన్ స్టీవర్ట్ తన హీల్స్ తీసివేసారు. 2024లో కూడా క్రిస్ హేమ్స్‌వర్త్ టై లేకుండా రెడ్ కార్పెట్‌పై కంపించారు.ఇక ఇప్పుడు కేన్స్ తీసుకున్న నిర్ణయాన్ని కొంతమంది సమర్థిస్తుండగా, మరికొంతమంది మాత్రం రూల్స్ పేరుతో క్రియేటివిటీని చంపేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు.

Read Also : పెళ్లి కావాల్సిన అమ్మాయిలే ఈ కిల్లర్ టార్గెట్… రూపాలు మార్చుకుని మరీ ఆ పాడు పని

కాగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 మే 13 నుండి 24 వరకు జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే కొత్త డ్రెస్ కోడ్ రూల్స్ తో రెడ్ కార్పెట్ ఫ్యాషన్‌ను మరింత సంప్రదాయబద్ధం, సౌకర్యవంతంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ రూల్స్ సెలబ్రిటీల ఫ్యాషన్ సెలెక్షన్ పై ఎలాంటి ప్రభావం చూపుతుంది ? వాళ్ళు ఈ రూల్స్ ను ఎంతవరకు ఫాలో అవుతారు? అనేది చూడాల్సి ఉంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×