DSSSB Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్.. ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (డీఎస్ఎస్ఎస్‌బీ) లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యో్గాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్, ఐటీఐ, ఇంటర్, బీటెక్, డిగ్రీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం చేయకుండా వెంటనే ఈ ఉద్యోగ నోటిఫికేషన్ చదివేయండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు గడువు, వయస్సు, దరఖాస్తు విధానం, తదితర వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (డీఎస్ఎస్‌ఎస్‌బీ) లో 615 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 16న దరఖాస్తు గడువు ముగియనుంది.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 615
ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డులో స్టాటిస్టకల్ క్లర్క్, నాయబ్ తహసీల్దార్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, చీఫ్ అకౌంటంట్, తదితర ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: బీఏ, బీకామ్, బీఎడ్, బీఎస్సీ, టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు: ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 37 ఏళ్ల వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.100 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
ముఖ్యమైన డేట్స్…
దరఖాస్తుకు ప్రారంభ తేది: ఆగస్టు 18
దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్ 16
జీతం: సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. రూ.18000 నుంచి రూ.1,51,000 వరకు వేతనం ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్‌ను సందర్శించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://dsssb.delhi.gov.in/
అర్హత ఉండి ఆసక్తి ఉన్న వారు వెంటనే అప్లై చేసుకోండి. సెలక్ట్ అయిన వారికి మంచి వేతనం కూడా ఉంటుంది. రూ.18000 నుంచి రూ.1,51,000 వరకు వేతనం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్
ALSO READ: NRSC Recruitment: హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. స్టైఫండ్ ఇచ్చి జాబ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఎనఫ్..!!
నోటిఫికేషన్ కీలక సమాచారం:
మొత్తం వెకెన్సీల సంఖ్య: 615
దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్ 16
జీతం: రూ.18000 నుంచి రూ.1,51,000 వరకు వేతనం ఉంటుంది.