Surveyor Notification: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు ల్యాండ్ సర్వేయర్ గా మారేందుకు ఇది సువర్ణవకాశం అని చెప్పవచ్చు. ఇంటర్ లేదా డిప్లొమా లేదా బీటెక్ అర్హత ఉన్న వారికి ఇది మంచి అవకాశం అనే చెప్పవచ్చు. తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మెనేజ్ మెంట్ కీలక ప్రకటన విడుదల చేసింది. లైసెన్సుడ్ సర్వేయర్ల శిక్షణ కోసం అర్హత గల వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. దీనికి సంబంధించిన వివరాలను క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
తెలంగాణ రాష్ట్రంలో లైసెన్సుడ్ సర్వేయర్ల శిక్షణ కోసం అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్ మెంట్ ఓ కీలక ప్రకటనను విడుదల చేసింది. అర్హత ఉండి ఆసక్తి ఉన్న వారు మీ సేవలో దరఖాస్తు చేసుకోవచ్చు. మే 17 దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా దరఖాస్తు చేసుకోవాలి.
విద్యార్హత: ఎంపీసీ విభాగంలో ఇంటర్మీడియట్ లో 60 శాతం మార్కులు పొందిన వారు లేదా ఐటీఐ డ్రాఫ్ట్స్ మెన్ (సివిల్) లేదా సివిల్ విభాగంలో డిప్లొమా లేదా బీటెక్ పాసైన వారు ఈ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తుకు చివరి తేది: అర్హత కలిగిన అభ్యర్థులు మే 5 నుంచి మే 17 వరకు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు: దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.100 చెల్లించి మీ సేవా కేంద్రంలో అప్లై చేసుకోవాలి.
⦿ ఎంపికైన అభ్యర్థులకు 50 రోజుల పాటు శిక్షణ ఇస్తారు.
⦿ శిక్షణ కోసం ఓసీ అభ్యర్థులు రూ.10 వేలు, బీసీ అభ్యర్థులు రూ.5వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2500 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
⦿ దీనికి సంబంధించి పూర్తి వివరాల కోసం 9849081489, 9441947399, 7032634404 నెంబర్లలో కాంటాక్ట్ అవ్వొచ్చు.
⦿ త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో 1000 సర్వేయర్ పోస్టులను భర్తీ చేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధంగా ఉన్న నేపథ్యంలో.. శిక్షణ పొంది సర్టిఫికెట్లు పొందిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హత సాధిస్తారు. సర్వేయర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోని ఈజీగా ఉద్యోగం సాధించే అవకాశం ఉంటుంది.
Also Read: Jobs: దీన్‌దయాల్ పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు.. ఇంటర్, డిగ్రీ ఉంటే చాలు.. జీతమైతే రూ.65,000