AIIMS Bibinagar: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఎండీ, ఎంఎస్, డీఎం, ఎంసీహెచ్, పీహెచ్‌డీ(ఎమ్మెస్సీ, ఎం బయోటెక్) పాసైన అభ్యర్థులకు మంచి అవకాశం. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, బీబీనగర్ పలు విభాగాల్లో ఖాళీగా ఉన్నఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 28న దరఖాస్తు గడువు ముగియనుంది.
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, బీబీనగర్ పలు విభాగాల్లో వెకెన్సీ ఉన్న సీనియర్ రెసిడెండ్ పోస్టుల భర్తీకీ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఓ సారి నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, బీబీనగర్ లో మొత్తం 75 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.
మొత్తం పోస్టుల వెకెన్సీ సంఖ్య: 75
కేటగిరీ వారీగా ఉద్యోగాలు..
యూఆర్: 13 ఉద్యోగాలు
ఓబీసీ: 30 ఉద్యోగాలు
ఎస్సీ: 20 ఉద్యోగాలు
ఎస్టీ: 9 ఉద్యోగాలు
ఈడబ్ల్యూఎస్: 3 ఉద్యోగాలు
ఇందులో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన లో దరఖాస్తు చేసుకోండి.
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఫిబ్రవరి 28
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, బీబీనగర్ లో వివిధ విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
అనస్థీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, ఈఎన్‌టీ, ఫారెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ, జనరల్ మెడిసిన్ అండ్ సూపర్ స్పెషాలిటీస్, జనరల్ సర్జరీ అండ్ సూపర్ స్పెషాలిటీస్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, మైక్రోబయాలజీ, ఓబీజీవై, ఆర్థోపెడిక్స్, ఆప్తాల్మాలజీ, పీడీయాట్రిక్స్ అండ్ నియోనెటాలజీ, పాథాలజీ, ఫార్మకాలజీ, ఫిజియాలజీ, ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహబిలిటేషన్, సైచారిటీ, రేడియో డైయాగ్నోసిస్, ట్రాన్స్‌ఫ్యూషన్ మెడిసిన్ అండ్ బ్లడ్ బ్యాంక్ విభాగాల్లో ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్, డీఎం, ఎంసీహెచ్, పీహెచ్ డీ (ఎంఎస్సీ, ఎంబయోటెక్)లో పాస్ తో పాటు వర్క్ ఎక్స్ పీరియన్స్ కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వయస్సు: 2025 ఫిబ్రవరి 28 నాటికి అభ్యర్థుల వయస్సు 45 ఏళ్ల మంచి ఉండకూడదు. వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయస్సు సడలింపు ఉంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంది. జనరల్ దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉండగా.. ఓబీసీ దివ్యాంగ అభ్యర్థులకు 13 ఏళ్ల వయస్సు సడలింపు ఉంది. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు 15 ఏళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: ఓబీసీ, జనరల్ అభ్యర్థులకు రూ.1770 ఉంది. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1416 ఉంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, మహిళా అభ్యర్థులు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
ఉద్యోగ దరఖాస్తు ప్రక్రియ: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవాలి.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: ఎలాంటి రాత పరీక్ష ఉండదు. ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://aiimsbibinagar.edu.in/seniorresident.html
అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించడి. ఆల్ ది బెస్ట్.