MED Recruitment: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. డిగ్రీ, బీటెక్/బీఈ, డిప్లొమా, ఇంటర్, టెన్త్, పీజీ, పీజీ డిప్లొమా, ఎంఎస్‌డబ్ల్యూ, డీఎంఎల్టీ పాసైన అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం అనే చెప్పవచ్చు. మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ (తూర్పు గోదావరి) లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత ఉన్న వారు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం కూడా ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
తూర్పు గోదావరి, మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ( EAST GODAVARI)లో ఒప్పంద, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. అర్హత ఉండి ఆసక్తి గల అభ్యర్థులు మే 12వ తేదీ వరకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 79
మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ లో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. కంప్యూటర్ ప్రోగ్రామర్, ఫిజికిల్ ఎడ్యుకేషన్ ట్రైనర్, ఎలక్ట్రికల్ హెల్పర్, మార్చురీ అటెండెంట్, ఆఫీస్ సబార్డినేట్, అనస్థీషియా టెక్నీషన్, కార్డియాలజీ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్, నెట్ వర్క్ అడ్మినిస్ట్రేటర్, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు చూసినట్టయితే..
పోస్టు పేరు-ఖాళీలు
1. కంప్యూటర్ ప్రోగ్రామర్: 02
2. ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్: 01
3. ఎలక్ట్రికల్ హెల్పర్: 03
4. మార్చురీ అటెండెంట్: 01
5. ఆఫీస్ సబార్డినేట్: 22
6. అనస్థీషియా టెక్నీషన్: 01
7. కార్డియాలజీ టెక్నీషియన్: 03
8. ల్యాబ్ టెక్నీషియన్: 01
9. నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్: 01
10. ఆపరేషన్ థీయేటర్ టెక్నీషియన్: 01
11. సైకియాట్రిక్ సోషల్ వర్కర్: 02
12. స్పీచ్ థెరపిస్ట్: 01
13. సిస్టం అడ్మినిస్ట్రేటర్: 01
14. జనరల్ డ్యూటీ అటెండెంట్: 09
15. స్టోర్ అటెండెంట్: 02
16. చైల్డ్ సైకాలజిస్ట్: 01
17. క్లినికల్ సైకాలజిస్ట్: 01
18. ల్యాబ్ అటెండెంట్: 01
19. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్: 25
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీటెక్/బీఈ, డిప్లొమా, ఇంటర్, టెన్త్, పీజీ, పీజీ డిప్లొమా, ఎంఎస్‌డబ్ల్యూ, డీఎంఎల్టీలో పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 ఏప్రిల్ 30
దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 12
వయస్సు: 42 ఏళ్లు మించరాదు.
దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులకు రూ.500 ఫీజు ఉంటుంది. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.300 ఫీజు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక ప్ర్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
చిరునామా: దరఖాస్తు ఫారంను అడిషినల్ డీఎంఈ/ ప్రిన్సిపల్, ప్రభుత్వ మెడికల్ కాలేజ్, రాజమహేంద్రవరం అడ్రస్ కు పంపాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ కు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://eastgodavari.ap.gov.in/
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
దరఖాస్తుకు చివరి తేది: మే 12
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 79
Also Read: BPNL Recruitment: టెన్త్, ఇంటర్ అర్హతతో 12,891 ఉద్యోగాలు.. జీతం రూ.75,000