Tollywood Movies:భారత్ -పాకిస్తాన్ సరిహద్దుల్లో ఏప్రిల్ చివరి వారంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇవి మే మొదటి వారంలో పెరిగాయి. జమ్మూ కాశ్మీర్ లో జరిగిన కాల్పుల ఒప్పందము వలన భద్రత ఆందోళనలు పెంచాయి. దాని పర్యవసానం సరిహద్దు ప్రాంతాల్లో షూటింగు నిర్వహిస్తున్న చిత్రాలకు భద్రతా కారణాల రీత్యా షెడ్యూల్ వాయిదా వేయవలసి వచ్చింది. బాలీవుడ్, టాలీవుడ్ మరియు ఇతర ప్రాంతీయ సినిమాల పరిశ్రమపై ఈ ప్రభావం గణనీయంగా చూపిస్తుంది. యుద్ధ వాతావరణం కారణంగా షూటింగులు నిలిచిపోయిన బాలీవుడ్, టాలీవుడ్ మూవీస్ గురించి చూద్దాం..
బ్రేక్ పడిన స్టార్ హీరోస్ సినిమాలు..
భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణంతో టాలీవుడ్ ని ఉక్కిరి, బిక్కిరి చేస్తోంది. ఆర్మీ బాగ్ డ్రాప్ లో వచ్చే సినిమాలకు బ్రేక్ పడవలసి వస్తుంది. ఆర్మీ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమాల షూటింగ్స్ ఉన్న నో పర్మిషన్ అనడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ షాక్కి గురైంది. షూటింగ్స్ లేకపోవడంతో ప్యాకప్ చెప్పేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ హీరోలంతా సమ్మర్ హాలిడే ట్రిప్స్ కి వెళ్ళనున్నారు. భారత్ -పాక్ వద్దయుద్ధ వాతావరణం నెలకొన్నవేళ దేశంలో ఉధృత పరిస్థితులు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇండియా -పాకిస్తాన్ సరిహద్దుల నెలకొన్న పరిస్థితులను నేపథ్యంలో హైదరాబాదు నుంచి అనేక సినిమాల షూటింగ్స్ తాత్కాలికంగా బ్రేకప్ చెప్పనన్నట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే సిటీ పరిసరాల్లోని, ఆర్మీ లొకేషన్ లకు ప్రస్తుతం అనుమతులు లేవు భద్రతా కారణాల రీత్యా, కొంతకాలం పాటు షూటింగ్ కు వెళ్లే పరిస్థితి లేదు అనేది సమాచారం. దీంతో పలు స్టార్ హీరోలు సమ్మర్ వెకేషన్ కు వెళ్ళనున్నారు. అయితే ఫస్ట్ టైం సమ్మర్ వెకేషన్ కి టాలీవుడ్ హీరోలు క్యూ కడుతున్నారు. పైగా ఎక్కువ రోజులు విదేశాల్లో ఉండేట్లు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక పాక్ భారత్ మధ్య యుద్ధం జరిగితే, సినిమాలకు చాలా రోజులు బ్రేక్ పడే అవకాశం ఉంది. రిలీజ్ చేయడానికి కూడా కుదరని పరిస్థితి ఏర్పడతాయి. ప్రజలు ఇళ్ల నుండి బయటకు వచ్చే అవకాశం తక్కువ, యుద్ధం మొదలైతే సినిమా చూసే ఇంట్రెస్ట్ కూడా ప్రజల్లో ఉండదు. అందుకే ప్రస్తుతం భారత్, పాక్ మధ్య యుద్ధం జరగకూడదని టాలీవుడ్ కోరుకుంటుంది. సినిమా ఇండస్ట్రీ అనేక సమస్యలు ఎదుర్కొక తప్పదు, అందుకే యుద్ధం వద్దని సినీ పరిశ్రమ మొత్తం కోరుకుంటుంది.
యుద్ధ వాతావరణం కారణంగా షూటింగ్స్ బ్రేక్ పడనున్న సినిమాల వివరాలు చూస్తే..
బాలీవుడ్ నుండి సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో హృతిక్ రోషన్ హీరోగా వస్తున్న ఫైటర్2 మూవీ బ్రేక్ పడనుంది, మరో బాలీవుడ్ మూవీ బోర్డర్ 2 అనురాగ్ సింగ్ దర్శకత్వంలో సన్నీ డియోల్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం కూడా బ్రేక్ పడనున్నట్లు సమాచారం. ఇక టాలీవుడ్ నుంచి ప్యారడైజ్ చిత్రం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా నటిస్తున్న చిత్రం. ఈ మూవీ షూటింగ్ బ్రేక్ పడనుంది. ఇలా షూటింగ్ ఆగిపోవడం వల్ల నిర్మాణ ఖర్చులు పెరగడం విడుదల షెడ్యూలు ఆలస్యం అవ్వడం వల్ల సినిమా పరిశ్రమలో ఈ సవాల్ ను అధిగమించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను టాలీవుడ్ అన్వేషిస్తున్నట్లు సమాచారం.
Shrasti Verma:శ్రేష్టి వర్మపై కేసు నమోదు.. మరి అంత నోటి దూల పనికిరాదు..