Most ICC Tropies: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. దుబాయ్ వేదికగా ఆదివారం రోజున జరిగిన ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ను చిత్తు చేసింది టీమిండియా. నాలుగు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ పైన గెలిచిన టీమిండియా.. ముచ్చటగా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంటును గెలుచుకుంది. మహేంద్ర సింగ్ ధోని 2013 సంవత్సరంలో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిస్తే… ఆ తర్వాత అంటే దాదాపు 12 సంవత్సరాల తర్వాత చాంపియన్స్ ట్రోఫీ గెలిచింది టీమిండియా. ఇటు రోహిత్ శర్మ కెప్టెన్సీలో… ఇప్పటివరకు రెండు టోర్నమెంటులు గెలిచింది టీమిండియా. టి20 వరల్డ్ కప్ 2024 టోర్నమెంట్ను గెలిచిన రోహిత్ శర్మ… ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కూడా గెలుచుకున్నాడు.
Also Read: Chahal-Dhana shree: ప్రియురాలితో దుబాయికి చాహల్.. ధనశ్రీ సంచలన పోస్ట్?
ఈ నేపథ్యంలోనే… ప్రపంచవ్యాప్తంగా ఉన్న జట్లలో.. ఏ టీం ఎక్కువగా ఐసీసీ టోర్నమెంటులు గెలిచిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఆ వివరాలు ఒకసారి పరిశీలిస్తే… ఇందులో టీమ్ ఇండియా రెండో స్థానంలో నిలిచింది. ఐసీసీ టోర్నమెంట్ లు గెలిచిన దేశాలలో…. ఆస్ట్రేలియా జట్టు మొదటి స్థానంలో ఉంది. అప్పట్లో అత్యంత ప్రమాదకరంగా ఉన్న ఆస్ట్రేలియా… ఇప్పుడు ఐసీసీ టోర్నమెంటులలో… తేలిపోతుంది. అయినప్పటికీ ఇప్పటివరకు… పది ఐసీసీ టోర్నమెంట్లు కంగారుల జట్టు. ఇక ఆస్ట్రేలియా తర్వాత టీమ్ ఇండియా రెండవ స్థానంలో ఉంది. ఇప్పటివరకు.. టీమిండియా ఏకంగా ఏడు ఐసీసీ టోర్నమెంట్లు గెలుచుకుంది. ఇందులో వన్డే వరల్డ్ కప్, టి20 వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీ అన్నీ ఉన్నాయి. మహేంద్ర సింగ్ ధోనికే ఫ్రెండ్స్ లో మూడు టోర్నమెంటులు వస్తే… రోహిత్ శర్మ కెప్టెన్సీలో రెండు రావడం జరిగింది.
Also Read: Tobacco Alcohol Ban: IPLలో ఆ యాడ్స్ బ్యాన్ చేయండి… కేంద్రం కీలక ఆదేశాలు
ఇక టీమిండియా తర్వాత.. ఈ లిస్టులో వెస్టిండీస్ ఉంది. ఇప్పటివరకు ఐదు టోర్నమెంటులు గెలిచింది వెస్టిండీస్ టీం. ఆ తర్వాత లిస్టులో పాకిస్తాన్… ఉండడం జరిగింది. ఇప్పటివరకు… మూడు ఐసీసీ టోర్నమెంటులు గెలిచింది పాకిస్తాన్ టీం. ఇక పాకిస్తాన్ టీం తర్వాత… మూడు టోర్నమెంటులు గెలిచింది ఇంగ్లాండ్ టీం. క్రికెట్ కనిపెట్టింది ఇంగ్లాండ్ అయినప్పటికీ… ఐసీసీ టోర్నమెంట్లో ఆ జట్టు మాత్రం దారుణంగా విఫలమవుతోంది. మొన్నటి చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్లో ఒక్క మ్యాచ్ గెలవకుండానే టోర్నీ నుంచి వైదొలిగింది ఇంగ్లాండ్. ఇక ఇంగ్లాండ్ తర్వాత శ్రీలంక మూడు టోర్నమెంట్లు గెలుచుకుంది. ఆ తర్వాత న్యూజిలాండ్ జట్టు రెండు టోర్నమెంటులు గెలుచుకుంది. సౌత్ ఆఫ్రికా మాత్రం ఒకే ఒక్క ఐసీసీ టోర్నమెంట్ గెలుచుకొని దారుణంగా విఫలమవుతోంది. సెమీఫైనల్ లేదా ఫైనల్ దాకా వచ్చి సౌత్ ఆఫ్రికా చాలా ఐసీసీ టోర్నమెంట్లలో ఓడిపోయింది. మొన్న చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్లో సెమీఫైనల్ లో ఓడిపోయింది సౌత్ ఆఫ్రికా. 2024 t20 వరల్డ్ కప్ లో.. ఫైనల్ మ్యాచ్లో చిత్తయింది.