NIPHM Recruitment: రెండు తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. టెన్త్, డిగ్రీ, పీజీ పాసైన అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం అనే చెప్పవచ్చు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్, హైదరాబాద్ (NIPHM)లో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం ఉంటుంది.
హైదరాబాద్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజేమెంట్ (NIPHM) ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి. జూన్ 2న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా అభ్యర్థులు దరఖాస్తు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 8
హైదరాబాద్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజేమెంట్‌లో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. జాయింట్ డైరెక్టర్ (కెమిస్ట్రీ), జాయింట్ డైరెక్టర్ (పీహెచ్ఎం డివిజన్), రిజిస్ట్రార్, ల్యాబ్ అటెండెంట్ , ఎంటీఎస్ (కేటగిరి-2) ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు:
జాయింట్ డైరెక్టర్(కెమిస్ట్రీ): 01
జాయింట్ డైరెక్టర్(పీహెచ్ఎం డివిజన్): 01
రిజిస్ట్రార్: 01
ల్యాబ్ అటెండెంట్(కేటగిరి-1,2,3): 03
ఎంటీఎస్(కేటగిరి-2): 02
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో టెన్త్, డిగ్రీ, పీజీ, ఎంఫిల్/ పీహెచ్‌డీ పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 మే 3
దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 2
వయస్సు: 18 నుంచి 56 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. రూల్స్ ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు ఎంటీఎస్, ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలకు రూ.18వేల నుంచి రూ.56,900 జీతం ఉంటుంది. మిగితా పోస్టులకు రూ.78,800 నుంచి రూ.2,09,200 జీతం ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి గ్రూప్-ఏ, బీ పోస్టులకు రూ.590 ఉంటుంది. గ్రూప్-సీ పోస్టులకు రూ.295 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://niphm.gov.in
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులకు వెంటనే ఈ జాబ్స్‌కు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి భారీ వేతనం కూడా ఉంటుంది. నెలకు ఎంటీఎస్, ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలకు రూ.18వేల నుంచి రూ.56,900 జీతం ఉంటుంది. మిగితా పోస్టులకు రూ.78,800 నుంచి రూ.2,09,200 జీతం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. దరఖాస్తు చేసుకోండి. జాబ్ కొట్టండి. ఆల్ ది బెస్ట్.
Also Read: Union Bank Jobs: యూనియన్ బ్యాంక్ ఉద్యోగాల నోటిఫికేషన్.. 500 ఉద్యోగాలు, ఇంకెందుకు ఆలస్యం
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం పోస్టుల సంఖ్య: 8
దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 2