షూటింగ్ లో పవన్ ..ఫాన్స్ ఫుల్ ఖుషి ..
మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఎంఎంరత్నం నిర్మాతగా, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్న సినిమా హరిహర వీరమల్లు. మొదట క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ తర్వాత జ్యోతి కృష్ణ లైన్ లోకి వచ్చారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు సోషల్ మీడియా వేదికగా పండుగలాంటి వార్త తెలిసింది. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్లో పవన్ ఈ రోజు నుంచి పాల్గొంటున్నట్లు సమాచారం. పవన్ కు సంబంధించిన బ్యాలెన్స్ సీన్స్ పార్ట్స్ ను పూర్తి చేయబోతున్నట్లు సమాచారం. ఈనెల 7, 8 తేదీల వరకు జరిగే షూటింగ్ ను జ్యోతి కృష్ణ పక్క ప్లాన్ తో పవన్ కళ్యాణ్ తో మిగిలిన పార్ట్ ను పూర్తి చేయనున్నారు. బాలీవుడ్ లెజెండ్రీ స్టంట్ మాస్టర్ నిక్ పావెల్ పర్యవేక్షణలో ఓ భారీ యాక్షన్ సీన్స్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ షూటింగ్లో జనసేనాని పాల్గొంటున్నారు. దాదాపు 400 మందితో ఈ ఫైట్ సీన్ ఉంటుందని టాక్. ఇప్పటికే పవన్ చేతిలో హరిహర వీరమల్లు తోపాటు ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి సినిమాలు ఉన్నాయి. వీటన్నిటినీ త్వరగా కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం హరిహర వీరమల్లు షూటింగ్ కంప్లీట్ చేసి తదుపరి సినిమాకు వెళ్ళనున్నారు. ఇది ఫ్యాన్స్ కి పండగ లాంటి వార్త అని చెప్పొచ్చు.
పాన్ ఇండియా మూవీ…
ఈ చిత్రం పిరియాటిక్ యాక్షన్ అడ్వెంచర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో ఎక్కువగా యాక్షన్ సీన్స్ ఉంటాయని టాక్. ఇందుకోసం పవన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ నటిస్తున్నారు. ఈ మూవీలో బాబి డియో విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. మొదటి పాట జనవరి 17న మాట వినాలి అంటూ.. రెండవ పాట కొల్లగొట్టినాదిరో.. ఫిబ్రవరి 24వ తేదీన రిలీజ్ అయ్యాయి. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకులు ముందుకు రానుంది. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తొలిభాగం హరిహర వీరమల్లు పార్ట్ 1 మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Good Bad Ugly : అప్పుడే ఓటీటీకి అజీత్.. గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ, స్ట్రీమింగ్ ఎప్పుడు అంటే?