ISRO Notification: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది శుభవార్త. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లో పలు ఉద్యోగాల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, వెకెన్సీలు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, తదితర వివరాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకుందాం.
తిరువనంతపురం, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ISRO)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగన వారు జూన్ 4 నుంచి 18వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 83
విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, కెమికల్, ఆటోమొబైల్, సివిల్, రిఫ్రిజిరేషన్ & ఏసీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల్లో పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
ఉద్యోగాలు – వెకెన్సీలు:
టెక్నికల్ అసిస్టెంట్: 76
సైంటిఫిక్ అసిస్టెంట్: 05
లైబ్రరీ అసిస్టెంట్-ఏ: 02
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా(ఎలక్ట్రానిక్స్, ఇనుస్ట్రుమెంటేషన్), డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్‌ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 జూన్ 4
దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 18
వేతనం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు భారీ వేతనం ఉంటుంది. నెలకు రూ.44,900 నుంచి రూ.1,42,400 జీతం ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్ లైన్‌లో అప్లై చేసుకోవాలి.
వయస్సు, దరఖాస్తు ఫీజు, ఉద్యోగ ఎంపిక ప్రక్రియ, తదితర వివరాలకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.isro.gov.in/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం ఉంటుంది. నెలకు రూ.44,900 నుంచి రూ.1,42,400 జీతం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
ALSO READ: SSC Notification: భారీ శుభవార్త.. ఎస్ఎస్‌సీలో 2402 ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే లైఫ్ సెట్ బ్రో..
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 83
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 జూన్ 4
దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 18
జీతం: నెలకు రూ.44,900 నుంచి రూ.1,42,400 జీతం