Chris Gayle: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ ఫైనల్ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య బిగ్ ఫైట్ జరుగుతోంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మొదట బ్యాటింగ్ చేసింది. అయితే మొదటి బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు… రెండు వికెట్లను త్వరగానే కోల్పోయింది. దాదాపు 9 ఓవర్లు ఆడినప్పుడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 70 పరుగులు వరకు చేరుకుంది.
Also Read : RCB – Evil Eye : టైటిల్ గెలవాలని RCB ఫ్యాన్ ప్లానింగ్… కారు మొత్తం నిమ్మకాయలు, మిరపకాయలు కట్టి మరీ
బెంగళూరుకు వెన్నుపోటు పొడిచిన గేల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు వెన్నుపోటు పొడిచాడు డేంజర్ ఆటగాడు క్రిస్ గేల్. రాయల్ చాలెంజెస్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియానికి వచ్చిన క్రిస్ గేల్…. కోహ్లీకి అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నాడు.
ఈ మ్యాచ్ నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జెర్సీ ధరించి…. పంజాబ్ కింగ్స్ కు సపోర్ట్ చేస్తూ కనిపించాడు. జెర్సీ మాత్రం బెంగళూరు జట్టుది వేసి… తలపాగా మాత్రం పంజాబ్ కింగ్స్ ది ధరించాడు. దీంతో క్రిస్ గేల్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు వైరల్ గా మారిన నేపథ్యంలో… క్రిస్ గేల్ పై దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీకి వెన్నుపోటు పొడుస్తూ క్రిస్ గేల్ ఇలా వ్యవహరిస్తున్నాడని సెటైర్లు పేల్చుతున్నారు.
కెప్టెన్ గా మారిన విరాట్ కోహ్లీ
ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ఫైనల్ నేపథ్యంలో…. కెప్టెన్ గా మారిపోయాడు విరాట్ కోహ్లీ. మ్యాచ్ ప్రారంభాని కంటే ముందు ప్లేయర్ లందరితో… చర్చ మొదలుపెట్టాడు. గ్రౌండ్లో అందరిని ఒకే దగ్గరికి చేర్చి… మధ్యలో తాను కూర్చొని… ప్లేయర్ లందరికీ సలహా సూచనలు ఇచ్చాడు విరాట్ కోహ్లీ. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై విరాట్ కోహ్లీని ఉద్దేశించి కొంతమంది నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఆ బొక్కలే నీ కెప్టెన్సీలో ఒక కప్ అయినా తీసుకువచ్చావా…? నువ్వు సలహాలు సూచనలు ఇస్తే.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టైటిల్ గెలుస్తుందా ? అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొంతమంది విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మాత్రం అతనికి సపోర్ట్ గా నిలుస్తున్నారు. కోహ్లీ సలహా సూచనలతో పంజాబ్ కింగ్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గ్రాండ్ విక్టరీ కొట్టి ఛాంపియన్గా నిలుస్తుంది అని చెబుతున్నారు.
— Out Of Context Cricket (@GemsOfCricket) June 3, 2025