BigTV English
Advertisement

OTT Movie: అమ్మాయిలను ఏంజెల్ రూపంలో చంపే సైకో… పోలీసులకే చుక్కలు చూపించే క్రైమ్ కథా చిత్రమ్

OTT Movie: అమ్మాయిలను ఏంజెల్ రూపంలో చంపే సైకో… పోలీసులకే చుక్కలు చూపించే క్రైమ్ కథా చిత్రమ్

OTT Movie : థ్రిల్లర్ సినిమాలలో సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాల రూటే సేపరేటు. ఒక్కో ట్విస్ట్ తో ప్రేమకూలను పిచ్చెక్కించే ఈ సినిమాలు సస్పెన్స్ ను ఇష్టపడే ఆడియన్స్ కు బాగా నచ్చుతాయి. ఓటిటిలలో అలాంటి ఇంట్రెస్టింగ్ సినిమాల కోసం వెతికే మూవీ లవర్స్ కోసమే ఈ మూవీ సజెషన్. ఇంతకీ ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది? కథ ఏంటి? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం పదండి.


రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్
ఈ అమెరికన్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘మైండ్‌కేజ్’ (Mindcage). 2022 లో వచ్చిన ఈ మూవీకి మౌరో బోర్రెల్లి దర్శకత్వం వహించారు. ఇందులో మార్టిన్ లారెన్స్, మెలిస్సా రాక్స్‌బర్గ్, జాన్ మాల్కోవిచ్ వంటి నటులు నటించారు. ఒక చిత్రం. ఈ చిత్రం . కథలో డిటెక్టివ్‌లు జేక్ డోయల్ (మార్టిన్ లారెన్స్), మేరీ కెల్లీ (మెలిస్సా రాక్స్‌బర్గ్) ఒక సీరియల్ కిల్లర్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించే క్రమంలో ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video), నెట్‌ ఫ్లిక్స్‌ (Netflix) లలో ఈ మూవీ అందుబాటులో ఉంది. అంటే ఈ మూవీ ప్రస్తుతం రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతోంది. ఏ ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఉంటే అందులో ఎంచక్కా ఈ మూవీని చూడవచ్చు మూవీ లవర్స్.

స్టోరీలోకి వెళితే
అర్నాడ్ లెఫ్యూర్ అనే సైకో కిల్లర్ ఐదు సంవత్సరాల క్రితం ఆరుగురు అమ్మాయిల్ని చంపి, వారి శరీరాలను దేవదూతల్లా అలంకరించి ప్రదర్శిస్తాడు. అందుకుగానూ ఆ కిల్లర్ ఇప్పుడు జైలు జీవితం గడుపుతుంటాడు. అయితే ఇప్పుడు అతను జైల్లో ఉండగానే, ఇదివరకు అతను చంపిన విధంగా బయట హత్యలు జరుగుతుంటాయి. ఈ కేసును జేక్, మేరీ అనే డిటెక్టివ్స్ తీసుకుని దర్యాప్తు చేయడం మొదలుపెడతారు. ఈ కేసుకు సంబంధించి ఈ డిటెక్టివ్స్ సహాయం తీసుకోవాలని అనుకుంటారు. ఈ క్రమంలో జైల్లో అతన్ని కలుస్తారు. అయితే అర్నాడ్ తన శిక్షను తగ్గించే ఒప్పందంతో దర్యాప్తులో సహాయం చేయడానికి ముందుకు వస్తాడు.


Read Also : ఈ ఊర్లో అమ్మాయిగా పుట్టడం అంటే గత జన్మలో చేసుకున్న పాపమే… అదిరిపోయే ట్విస్టులున్న థ్రిల్లర్ మూవీ

కానీ అతడు వీళ్ళను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తాడు. జేక్‌ ఈ కేసును పర్సనల్ గా తీసుకుంటాడు. ఎందుకంటే అర్నాడ్ అతని మనిషిని చంపి ఉంటాడు. ఇక ఈ కేసును చేధించే క్రమంలో డిటెక్టివ్స్ అనుకోని సమస్యల్లో చిక్కుకుంటారు. చివరకి హంతకున్ని ఈ డిటెక్టివ్స్ కనిపెడతారా ? అతను ఎందుకు అమ్మాయిల్ని దేవదూతల్లా అలంకరించి చంపుతున్నాడు ? జైలులో ఉన్న కిల్లర్ కి బయట జరుగుతున్న హత్యలకు సంబంధం ఉందా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ అమెరికన్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : ‘గేమ్ ఆఫ్ థ్రోన్’కు మించిన కంటెంట్ ఉన్న సిరీస్ మావా… అస్సలు వదలొద్దు

Phaphey Kuttniyan OTT : అందంగా దోచుకునే అమ్మాయిలు… కామెడీ మూవీకి క్రైమ్ ట్విస్ట్… 3 నెలల తరువాత ఓటీటీలోకి

Mithra Mandali OTT : ఓటీటీలోకి ‘మిత్రమండలి’… రీ-లోడెడ్ వెర్షన్ వర్కౌట్ అవుతుందా ?

November 2025 OTT releases : ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ నుంచి ‘స్ట్రేంజర్ థింగ్స్ 5’ వరకు… ఈ నెల ఓటీటీలో మోస్ట్ అవైటింగ్ సిరీస్ లు

OTT Movie : ‘గర్ల్ ఫ్రెండ్’ రిలీజ్ కంటే ముందు చూడాల్సిన రష్మిక మందన్న టాప్ 5 మూవీస్… ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

OTT Movie : టీనేజర్ల పాడు పనులు… బాయ్ ఫ్రెండ్ ను ఊహించుకుని… చిన్న పిల్లలు చూడకూడని మూవీ

OTT Movie : ఈ సినిమాను చూస్తే పోతారు మొత్తం పోతారు… డెడ్లీయెస్ట్ మూవీ ఎవర్… ఒంటరిగా చూసే దమ్ముందా ?

OTT Movie : మంత్రగాడి అరాచకం… అమ్మాయి దొరగ్గానే వదలకుండా అదే పని… చిన్న పిల్లలు చూడకూడని చిత్రం భయ్యా

Big Stories

×