Ms Dhoni: ఐపీఎల్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super Kings) వికెట్ కీపర్ ఎం.ఎస్. ధోనీ ( wicketkeeper M.S. Dhoni ) రిటైర్డ్ అవుతారని జరుగుతున్నటువంటి ప్రచారం పై ఆ జట్టు హెడ్ కోచ్ ప్లెమింగ్ తాజాగా స్పందించారు. ధోనీ రిటైర్మెంట్ పై తనకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. ప్రస్తుతం ఆయనతో కలిసి పని చేయడం చాలా సంతృప్తిని ఇస్తోంది. ఆయన గేమ్ ను చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ధోనీ చాలా స్ట్రాంగ్ మ్యాన్ అనే చెప్పాలి.
Also Read: Jofra Archer: అండర్టేకర్ లాగా నిద్ర లేచి..పంజాబ్ ను కూల్చేశాడు ?
ఇంకెన్నేళ్లయినా అతను క్రికెట్ ఆడగలడు. అతని రిటైర్మెంట్ గురించి జట్టు ఎలాంటి చర్చ జరగడం లేదని ఫ్లెమింగ్ చెప్పుకొచ్చారు. నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్ అనంతరం ధోనీ wicket keeper M.S. Dhoni ) రిటైర్మెంట్ ప్రకటిస్తారని అందరూ భావించారు. కానీ అలాంటిది ఏమి జరగలేదు. అయితే ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ హ్యాట్రిక్ ఓటమి చవిచూసింది. చెప్ వేదికగా జరిగినటువంటి మ్యాచ్ లో చెన్నై పై ఢిల్లీ క్యాపిటల్స్ 25 పరుగుల తేడా తో విజయం సాధించింది. 184 పరుగుల లక్ష్య ఛేదన లో చెన్నై సూపర్ కింగ్స్ 158/5 స్కోరుకే పరిమితం అయింది.
ఈ ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీకి ఇది వరుసగా మూడో విజయం కావడం విశేషం. చెన్నై సూపర్ కింగ్స్ కి ఇది హ్యాట్రిక్ ఓటమి కావడం విశేషం. ఢిల్లీ జట్టు పదిహేనేళ్ల తరువాత చెన్నై లో CSK ని ఓడించడం విశేషం. వాస్తవానికి ధోనీ రిటైర్మెంట్ చేస్తారని గత రెండు, మూడేళ్ల నుంచి ప్రచారం జరుగూతనే ఉంది. ఎన్ని ప్రచారాలు జరిగినప్పటికీ ధోనీ మాత్రం రిటైర్మెంట్ కావడం లేదని పలువురు పేర్కొంటున్నారు.
మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ కు ధోనీ తల్లిదండ్రులు హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. ధోనీకి అది చివరి మ్యాచ్ కావడంతోనే అతని తల్లిదండ్రులు నేరుగా స్టేడియం వద్దకు వచ్చారని వార్తలు వినిపించాయి. అయితే ధోనీ తన రిటైర్మెంట్ గురించి ఎలాంటి ప్రకటనా చేయలేదు. తాజాగా మీడియా ముందుకు వచ్చిన ధోనీ ఈ సీజన్ మొత్తం పూర్తయ్యే వరకు ఐపీఎల్ కి వీడ్కోలు పలికే ఆలోచన లేదని స్పష్టం చేశారు.
Also Read: Pakistan: పాకిస్థాన్ టీంలో ముసలం.. ఫ్యాన్స్, క్రికెటర్స్ దారుణంగా కొట్టుకున్నారు ?
“నేను ఐపీఎల్ ఆడాలా..? వద్దా..? అని నిర్ణయించేది నేను కాదు. నా శరీరం. నాకు ఇప్పుడు 43 సంవత్సరాలు. జులై నెలలో 44వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాను. ఈ ఐపీఎల్ పూర్తిగా ఆడుతాను. వచ్చే ఐపీఎల్ గురించి నిర్ణయించుకునేందుకు నాకు పది నెలల సమయం ఉంది. ఆ సీజన్ ప్రారంభానికి ముందు నా శరీరం సహకరిస్తోందనిపిస్తే.. ఆడతా. ఇక చాలు అనిపించే వరకు ఆడుతూనే ఉంటా. ఇప్పటికిప్పుడూ ఐపీఎల్ కి రిటైర్మెంట్ ప్రకటించను”అని ధోనీ స్పష్టం చేశారు.