NMDC STEEL LIMITED Recruitment: నిరుద్యోగులకు ఇది బంపర్ ఆఫర్ న్యూస్. ఐటీఐ, డిగ్రీ, బీఈ, బీటెక్, డిప్లొమా, పీజీ, సీఏ, ఎంఏ, ఎంబీఏ, పీజీడీఎంలో పాసైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అనే చెప్పవచ్చు. నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ఎండీసీ స్టీల్ లిమిటెడ్) లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగంలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోండి.
ఛత్తీస్‌గఢ్, నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(NMDC STEEL LIMITED) లో కాంట్రాక్ట్ విధానంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సీఈ పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోండి. మే 8 న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆలోగా అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 934
నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(NMDC STEEL LIMITED), ఛత్తీస్ గఢ్ లో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఇందులో సీఈ (కాంట్రాక్ట్ ఎంప్లాయ్) ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు:
సీఈ (కాంట్రాక్ట్ ఎంప్లాయ్) : 934 ఉద్యోగాలు
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 ఏప్రిల్ 24
దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 8
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీటెక్, బీఈ, డిప్లొమా, ఐటీఐ, పీజీ, సీఏ, ఎంఏ, ఎంబీఏ/పీజీడీఎం పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వయస్సు: 50 ఏళ్ల మించరాదు. రూల్స్ ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
జీతం: పోస్టులను బట్టి శాలరీని నిర్ణయించారు. పోస్ట్ కోడ్ సీఈ-2 నుంచి సీఈ-10 వరకు ఉద్యోగాలున్నాయి. నెలకు రూ.40,000 నుంచి రూ.1,70,000 వరకు జీతం ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://nmdcsteel.nmdc.co.in/
అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ జాబ్స్ కు అప్లై చేసుకోండి. మంచి వేతనం కూడా ఉంటుంది. నెలకు ఉద్యోగాన్ని బట్టి రూ.40,000 నుంచి రూ.1,70,000 వరకు జీతం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే జాబ్స్ కి అప్లికేషన్ పెట్టుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
Also Read: IDBI BANK: డిగ్రీ అర్హతతో 676 ఉద్యోగాలు.. రేపటి నుంచే అప్లికేషన్.. జీతం మాత్రం రూ.6,00,000 భయ్యా..
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 934
దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 8