Lokesh Kanagaraj : కేవలం తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే స్టార్ డైరెక్టర్ గా లోకేష్ కనకరాజ్ మంచి పేరు సంపాదించుకున్నాడు. షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ మొదలుపెట్టిన లోకేష్ మానగరం సినిమాతో తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. సందీప్ కిషన్ నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించింది. ఈ సినిమా తర్వాత చేసిన ఖైదీ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఇక్కడితో లోకేష్ కనగరాజ్ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. విజయ్, విజయ్ సేతుపతి ను పెట్టి మాస్టర్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమా తర్వాత విక్రమ్ సినిమా కమల్ హాసన్ కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసింది.
లోకేష్ సినీమాటిక్ యూనివర్స్
మాస్టర్ సినిమా తర్వాత కమల్ హాసన్ హీరోగా విక్రమ్ సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఇది ఒక మామూలు సినిమా అని అందరూ ఊహించరు. అయితే సినిమా రేపు రిలీజ్ అవుతుంది అనుకునే తరుణంలో ముందు రోజు విక్రమ్ సినిమా చూసే ముందు ఒకసారి ఖైదీ సినిమా ని చూడండి అంటూ ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు లోకేష్ కనగరాజ్. అది చాలామందికి రియల్ లైఫ్ బిగ్గెస్ట్ ట్విస్ట్ అనిపించింది. ఆ తర్వాత హాలీవుడ్ లో ఉండే సినీమాటిక్ యూనివర్స్ ఎక్స్పీరియన్స్ ను తెలుగు ప్రేక్షకులుకు అందించాడు. లోకేష్ తీసిన విక్రం సినిమా కూడా ప్రేక్షకులకు విపరీతంగా ఎక్కేసింది. ఇక్కడితో లోకేష్ ని అందరూ ఒక బ్రాండ్ డైరెక్టర్ గా చూడటం మొదలుపెట్టారు. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా కూలీ అనే సినిమాను చేస్తున్నాడు లోకేష్.
నిర్మాతగా కూడా అడుగులు
స్టార్ట్ డైరెక్టర్ గా పేరు సాధించుకున్న లోకేష్ ఇప్పుడు నిర్మాతగా కూడా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. లోకేష్ ప్రస్తుతం ఒక ప్రొడక్షన్ హౌస్ ను స్టార్ట్ చేశాడు. ఈ ప్రొడక్షన్ హౌస్ ద్వారా చిన్నచిన్న కథలను సినిమాలుగా తీసే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈ ప్రొడక్షన్ హౌస్ లో దాదాపు పది కథలు వింటే, వారిలో కనీసం ఐదు మంది డైరెక్టర్లు హీరోగా ఎవరు బాగుంటారు అంటే నటుడు సూరి పేరు చెబుతున్నారట. ఇంతకుముందు సూరి కొన్ని సినిమాల్లో కమెడియన్ గా కనిపించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన విడుదల సినిమాతో సరికొత్త నటుడుగా మారాడు సూరి. లోకేష్ ప్రొడ్యూసర్ గా సూరితో సినిమా చేసిన ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు.
Also Read : Pawan vs Vijay Devarakonda: తిట్టుకుచస్తున్న పవన్, విజయ్ ఫ్యాన్స్.. ఇంతకీ ఏమైంది?