BigTV English

Ind vs Eng 2nd Odi: రెండో వన్డేలో టీమిండియా గ్రాండ్ విక్టరీ..సిరీస్ కైవసం !

Ind vs Eng 2nd Odi: రెండో వన్డేలో  టీమిండియా గ్రాండ్ విక్టరీ..సిరీస్ కైవసం !

Ind vs Eng 2nd Odi: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య… జరిగిన రెండవ వన్డేలో… రోహిత్ శర్మ సేన గ్రాండ్ విక్టరీ కొట్టింది. రెండవ వన్డేలో నాలుగు వికెట్ల తేడాతో… గెలిచిన టీమిండియా…. సిరీస్ కూడా కైవసం చేసుకుంది. 300కు పైగా టార్గెట్ ఉన్నప్పటికీ… చాలా జాగ్రత్తగా ఆడిన టీమిండియా జట్టు… 2-0 తేడాతో మూడు వన్డేల సిరీస్ కైవసం చేసుకుంది. దింతో ఐదు టి20 సిరీస్ తో పాటు… 3 వన్డేల సిరీస్ కూడా టీమిండియా కైవసం చేసుకుంది.


Also Read: Ind vs Eng 2nd Odi: అర్ధాంతరంగా ఆగిపోయిన మ్యాచ్… కరెంట్ బిల్లు కట్టలేదా ఏంటి?

ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ సెంచరీ చేయడంతో… టీమిండియా అవలీలగా గెలవడం జరిగింది. 44.3 ఓవర్లలోనే… 6 వికెట్లు నష్టపోయిన టీమిండియా… గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇక ఈ మ్యాచ్లో టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్ చేసింది ఇంగ్లాండ్ జట్టు. మొదటి వన్డే తరహాలోనే బ్యాటింగ్ చేయాలని డిసైడ్ చేసుకున్న బట్లర్.. ఆరంభంలో దూకుడుగా.. ఆడే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో 49.5 ఓవర్లలో… 10 వికెట్లు కోల్పోయి 304 పరుగులు చేసింది ఇంగ్లాండు జట్టు. ఇంగ్లాండ్ బ్యాటర్లలో… ఓపెనర్ సాల్ట్ 26 పరుగులు చేయగా డకేట్… అద్భుతంగా రానించాడు.


56 బంతుల్లోనే 65 పరుగులు చేశాడు. ఇందులో 10 బౌండరీలు ఉన్నాయి. ఆ తర్వాత వచ్చిన రూటు అద్భుతంగా జట్టును ముందుకు తీసుకు వెళ్ళాడు. 72 బంతుల్లో 69 పరుగులు చేసిన రూట్… ఆరు బౌండరీలు కొట్టడం జరిగింది. హరి బ్రూక్ 31 పరుగులు చేయగా… ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ 34 పరుగులు చేసి రాణించారు. ఆ తర్వాత లివింగ్ స్టోన్ 41 పరుగులతో దుమ్ము లేపాడు. ఇంగ్లాండ్ టీం టేలండర్లు కూడా అద్భుతంగా రాణించడంతో… 49.5 ఓవర్లలో 304 పరుగులు చేశారు.

అయితే ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా… దూకుడుగా ఆడింది. దీంతో 44.3 ఓవర్స్ లోనే 6 వికెట్ నష్టపోయిన టీమిండియా… లక్ష్యాన్ని చేదించి… గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 119 పరుగులు చేసి దుమ్ము లేపాడు. ఇందులో 7 సిక్సర్లు 12 బౌండర్లు ఉన్నాయి. చాలా రోజుల తర్వాత రోహిత్ శర్మ ఫామ్ లోకి వచ్చాడు. అటు గిల్ కూడా మరో ఆఫ్ సెంచరీ తో రాణించడం జరిగింది. చివర్ లో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఇద్దరు కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చారు. దీంతో 3 వన్డే ల సిరీస్ ను 2-0 తేడాతో దక్కించుకుంది టీమిండియా.

Also Read: Champions Trophy 2025: ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాకిస్థానే తోపు.. టీమిండియాకు చెత్త రికార్డులు.. ?

ఇది ఇలా ఉండగా ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ లోకి వచ్చాడు కానీ… మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇంకా ఫామ్ లోకి రాలేదు. మొదటి వన్డే మ్యాచ్లో గాయం కారణంగా దూరమైన విరాట్ కోహ్లీ…. ఇవాల్టి మ్యాచ్లో ఆడాడు. అయితే రోహిత్ శర్మ లాగా ఆడతాడు అనుకుంటే… ఐదు పరుగులకే అవుట్ అయ్యాడు. రషీద్ బౌలింగ్లో… కీపర్ సాల్ట్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×