E-Paper
Advertisement

తెలంగాణ బీజేపీలో బిగ్ షాక్.. ఆ సెక్రటరీపై వేటు? కొత్తగా 5 పదవులు!

తెలంగాణ బీజేపీలో బిగ్ షాక్.. ఆ సెక్రటరీపై వేటు? కొత్తగా 5 పదవులు!
Advertisement

Telangana BJP: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్న బీజేపీ.. రాష్ట్ర పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసేందుకు సిద్ధమవుతోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. రాష్ట్ర కమిటీలో మరిన్ని పదవుల భర్తీకి కసరత్తు జరుగుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. గతంలో పదవులు దక్కలేదని అసంతృప్తికి లోనైన వారికి పదవులు కల్పించాలని హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలాఉండగా ఇప్పటికే ఉన్న కమిటీలో అదనంగా ఒక జనరల్‌ సెక్రటరీ, ఇద్దరు సెక్రటరీలు, ఇద్దరు ఉపాధ్యక్షులను నియమించే అంశం పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం కసరత్తు చేస్తోందన్న ప్రచారం రాష్ట్ర బీజేపీలో ఆసక్తికర చర్చకు తెరలేపింది. అలాగే.. ప్రస్తుతం రాష్ట్ర కమిటీలో కొనసాగుతున్న పదవుల్లో కొన్ని మార్పులు ఉండవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న సెక్రటరీల్లో ఒకరిని మార్చే అవకాశాలున్నాయన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. కొందరి పనితీరుపై పార్టీలో అంతర్గతంగా సమీక్ష జరుగుతోందని, సంస్థాగత కార్యక్రమాల్లో చురుకుదనం, పార్టీ నిర్దేశించిన బాధ్యతల నిర్వహణ వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉందని నేతల మధ్య చర్చ సాగుతోంది. అయితే ఆ సెక్రటరీ ఎవరనేది తెలియాల్సి ఉంది.

రేసులో ఆశావహులు, ఢిల్లీలో లాబీయింగ్!

Advertisement

కొత్తగా ఐదు పదవులు అందుబాటులోకి వస్తాయన్న ప్రచారంతో ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీకి సేవలందిస్తున్న పలువురు నేతలు ఈ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. తమకు ఉన్న రాజకీయ పరిచయాలు, సంస్థాగత అనుభవం, పార్టీ పెద్దలతో సంబంధాలను ఉపయోగించుకుని ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్‌ చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్ర నాయకత్వం దృష్టిలో పడటంతోపాటు జాతీయ నాయకత్వం నుంచి సానుకూల సంకేతాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కొత్త నియామకాల ప్రక్రియ పూర్తయిన తర్వాత రాష్ట్ర కమిటీలో నేతలకు బాధ్యతల పునర్విభజన జరిగే అవకాశముంది. ప్రస్తుతం వివిధ హోదాల్లో ఉన్న నేతలకు అప్పగించిన పనులతోపాటు కొత్తగా నియమితులయ్యే వారికి ప్రత్యేక బాధ్యతలు కేటాయించవచ్చని తెలుస్తోంది. జిల్లాల వారీగా పార్టీ బలోపేతం, సంస్థాగత విస్తరణ, ప్రజా సమస్యలపై పోరాటాలు, వివిధ మోర్చాల సమన్వయం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం.

కాంగ్రెస్‌ను ఢీకొట్టేందుకు బీజేపీ మాస్టర్ ప్లాన్..

Advertisement

తెలంగాణ బీజేపీలో ప్రస్తుతం ముగ్గురు జనరల్ సెక్రటరీలు ఉన్నారు. అలాగే 8 మంది ఉపాధ్యక్షులు, 8 మంది సెక్రటరీలు ఉన్నారు. వీటికి అదనంగా ఒక జనరల్ సెక్రటరీతో పాటు ఇద్దరు సెక్రటరీలు, ఇద్దరు ఉపాధ్యక్షులను నియమించే అవకాశాలను పార్టీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విస్తరణతో పార్టీని బలోపేతం చేయాలని యోచనలో హైకమాండ్ ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించారు. ఆయన చేపట్టిన పాదయాత్రకు భారీగా జనం తరలివచ్చారు. కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో దొరికే ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకూడదని హైకమాండ్ భావిస్తున్నట్లుగా సమాచారం.

అధికార లక్ష్యంగా బీజేపీ..

తెలంగాణలో అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో బీజేపీ తన రాజకీయ కార్యాచరణను విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో కేవలం రాజకీయ కార్యక్రమాలకే పరిమితం కాకుండా సంస్థాగతంగా కూడా పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని నాయకత్వం గుర్తించినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులను సమన్వయం చేయడం, క్షేత్రస్థాయిలో నాయకులకు స్పష్టమైన బాధ్యతలు అప్పగించడం, ప్రజల్లో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా తీసుకెళ్లడం వంటి అంశాలపై దృష్టి సారించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కమిటీలో మార్పులు, చేర్పులు అనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కొత్తగా ఎవరికి అవకాశం దక్కుతుంది? ప్రస్తుత కమిటీలో ఎవరికి స్థానచలనం ఉంటుంది? అన్న ప్రశ్నలు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Also Read: క్రాప్ హాలిడే ఎవరిది? ఫామ్ హౌస్‌లో కూర్చున్న కేసీఆర్‌దా? ప్రభుత్వందా? ఆది శ్రీనివాస్ సంచలనం!

Tags

Related News

క్రాప్ హాలిడే ఎవరిది? ఫామ్ హౌస్‌లో కూర్చున్న కేసీఆర్‌దా? ప్రభుత్వందా? ఆది శ్రీనివాస్ సంచలనం!

కేబీఆర్ తరహాలో లక్డీకాపూల్‌లోనూ వన్-వే రూట్.. సీపీ సజ్జనార్ కీలక నిర్ణయం.. ఎటు నుంచి వెళ్లాలంటే?

సర్కార్ ఆదాయ వేట.. హైదరాబాద్ పారిశ్రామిక భూములపై డిప్యూటీ సీఎం కీలక ప్రకటన!

మహిళల చేతిలో తేనె పరిశ్రమ.. గ్రామీణ వనితలకు తియ్యని ఉపాధి!

తెలంగాణ బీజేపీలో భారీ మార్పులు.. కొత్తగా ఐదు కీలక పదవులు.. ఢిల్లీ స్థాయిలో నేతల లాబీయింగ్!

ధరణి అక్రమాలపై రాష్ట్రవ్యాప్తంగా సీఐడీ మెరుపు దాడులు.. నలుగురు అరెస్టు!

ప్రయాణికులకు దీపావళి ధమాకా.. భారీగా తగ్గిన మెట్రో, ఆర్టీసీ జాయింట్ పాస్‌ల ధరలు!

Big Stories

Advertisement
×