BigTV English

US – Ukraine : ఉక్రెయిన రష్యాలో భాగం కావచ్చు – ట్రంప్ బాబు పేల్చాడు

US – Ukraine : ఉక్రెయిన రష్యాలో భాగం కావచ్చు – ట్రంప్ బాబు పేల్చాడు

US – Ukraine : రష్యాతో మూడేళ్లుగా తీవ్ర యుద్ధంలో తలమునకలైన ఉక్రెయిన్ ఎప్పటికైనా రష్యాలో కలుస్తుంది అంటూ ఆమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ లోని విలువైన ఖనిజాలపై కన్నేసిన ట్రంప్.. ఆ దేశాన్ని తన డిమాండ్లకు తగ్గట్టుగా మలుచుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే.. ఉక్రెయిన్ కు యుద్ధంలో సాయం చేయడం వల్ల తమకేంటి ప్రయోజనం అని ప్రశ్నిస్తున్న ట్రంప్.. ఇప్పుడు రష్యాలో భాగం కావచ్చు అంటు ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు.


అమెరికన్లకు దక్కాల్సిన వేల కోట్ల డాలర్లను ఉక్రెయిన్ యుద్ధంలో ఖర్చు చేస్తున్నామన్న ట్రంప్.. అక్కడ కుమ్మరిస్తున్న తమ సంపదను తిరిగి పొందాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అమెరికాతో ఉక్రెయిన్ ప్రత్యేక ఒప్పందం చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. ఉక్రెయిన్ కొన్నాళ్లకు రష్యాలో కలిసిపోవచ్చు, కలవకపోవచ్చు. కానీ.. ప్రస్తుతం కోట్లాది డాలర్లను అక్కడ కుమ్మరిస్తున్న అమెరికా… వాటన్నింటినీ తిరిగి పొందలనుకుంటోంది అని వెల్లడించారు.

ఇటీవలే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ కాల్ లో మాట్లాడినట్లు తెలిపిన తర్వాత.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పుతిన్ తో తమ యంత్రాంగం చర్చలు జరుపుతోందని తెలిపిన ట్రంప్.. తాము పురోగతి సాధించామంటూ వెల్లడించారు. అయితే.. ఈ విషయంపై అనుమానాలు వ్యక్తం చేసిన మీడియా.. ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత మాట్లాడారా, ముందే మాట్లాడారా అనే విషయంపై ఆరా తీసేందుకు ప్రయత్నించింది. దాంతో.. తాను మాట్లాడినట్లు ట్రంప్ స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో ఇలాంటి చర్యలు మరిన్ని జరుగుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.


అలాగే.. త్వరలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని కలవనున్నట్లు తెలిపారు. కాగా.. మునిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ చర్యలకు అవకాశం ఉందని అమెరికా యంత్రాంగం అంచనా వేస్తోంది. ఇంటర్నేషనల్ సెక్యూరిటీ చర్చలకు సంబంధించిన వార్షిక సదస్సు వివరాలను వైట్ హౌస్ అధికారులు త్వరలోనే విడుదల చేస్తారని రిటైర్డ్ లెఫ్టెనెంట్ జనరల్.. కెయిథ్ కెల్లోగ్ వెల్లడించారు. ఇతను.. ఉక్రెయిన, రష్యాలకు ట్రంప్ తరఫున రాయబారిగా ఉన్నారు.

జర్మనీలో జరగనున్న ఈ సదస్సుకు అమెరికా నుంచి అత్యున్నత కార్యవర్గ సభ్యులు హాజరుకానున్నారు. ట్రంప్ తో పాటు వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, స్టేట్ సెక్రటరీ మార్కో రూబియో, కెల్లోగ్ వంటి వారు హాజరు కానున్నారు. ఈ బృందం.. జెలెన్స్కీ, అతని సహచర బృందాలతో చర్చలు జరుపనున్నారు.

Also Read : పాక్ చైనా సంయుక్త నౌకాదళ విన్యాసాలు.. హిందూ మహాసముద్రంలో భారత్‌కు డేంజర్?

ఉక్రెయిన్ తో రష్యా యుద్దానికి కాలు దువ్వినప్పటి నుంచి ఆ దేశానికి అన్ని రకాల సాయాల చేస్తూ వస్తున్న అమెరికా.. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వరం మార్చింది. వేల కోట్ల డాలర్ల సాయం తామెందుకు చేయాలంటూ ట్రంప్ వ్యాపార ధోరణిలో మాట్లాడారు. యుద్ధంలో సాయం కావాలి అంటే దేశంలోని విలువైన ఖనిజాలు కావాలి అంటూ బేరం ఆడుతున్నారు. లేదంటే.. యుద్ధంలో కీలక ఆయుధాల్ని నిలిపివేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఈ తరుణంలోనే.. ఉక్రెయిన్ రష్యాలో భాగం అవ్వొచ్చు అని అనుమానం వ్యక్తం చేయడం ద్వారా.. సరికొత్త చర్చకు దారి తీశారు. అయితే.. ఈ వ్యాఖ్యలతో ఉక్రెయిన్ పై ఒత్తిడి పెంచాలనే ఆలోచన కనిపిస్తుంది అంటున్నారు.. విశ్లేషకులు.

Related News

Pakistan Military: సొంత ప్రజలపైనే బాంబుల వర్షం కురిపించిన పాక్ జెట్స్.. 30 మందికి పైగా దుర్మరణం

US on H 1B Visa: హెచ్‌-1బీ వీసా రుసుంపై వైట్‌హౌస్‌ క్లారిటీ.. వారికి మాత్రమే, ఇక భయం లేదు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

Cyber ​​Attack: యూరప్ ఎయిర్‌పోర్టులపై సైబర్ అటాక్.. వేలాది మంది ప్రయాణికులపై ఎఫెక్ట్

US Flights Cancelled: అమెరికాలో నిలిచిపోయిన వందలాది విమానాలు.. కారణం ఇదే!

H-1B Visa: రూ. 88 లక్షలు చెల్లిస్తేనే H-1B వీసా.. ట్రంప్ నుంచి మరో షాకింగ్ నిర్ణయం

Trump H-1B Visa Policy: ట్రంప్ సంచలన నిర్ణయం.. H1B వీసాలకు లక్ష డాలర్ల ఫీజు.. ఇండియ‌న్స్‌కి జాబ్స్ క‌ష్ట‌మే!!

Russia Earthquake: రష్యాని కుదిపేసిన భూకంపం.. 7.4 గా నమోదు, ఆ తర్వాత ఇండోనేషియాలో

Big Stories

×