అగ్నివీర్ వాయు ఉద్యోగాల్లో చేరాలని అనుకునే వారికి ఇదే మంచి అవకాశం. అర్హత ఉన్న వారు వెంటనే దీనిని సద్వినియోగం చేసుకోండి. దేశ వాయు సేనలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిన్నటి నుంచే అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులందరూ ఈ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకోండి.
విద్యార్హత: టెన్త్, ఇంటర్మీడియట్ 50 శాతం మార్కులతో పాసైన అభ్యర్థులు ఈఉద్యోగాల్లో చేరవచ్చు.
అర్హత పరీక్ష: ఆన్ లైన్ పరీక్షకు మూడు రోజుల ముందు అర్హత పరీక్ష అడ్మిట్ కార్డులు అభ్యర్థుల వ్యక్తిగత ఈ మెయిల్ కు రావడం జరుగుతుంది
దరఖాస్తుకు ప్రారంభతేది: 2025 జనవరి 7.
దరఖాస్తుకు ముగింపు తేది: 2025 జనవరి 27
జనవరి 27వ తేది సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తులు చేసుకోవాలి.
వేతనం: ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలోనే నెలకు రూ.40వేల వరకు జీతం ఉంటుంది.
అఫీషియల్ వెబ్ సైట్: https://agnipathvayu.cdac.in/AV/
Also Read: Qualcomm Jobs: మీరు డిగ్రీ, బీటెక్ పాసయ్యారా..? హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగాలు..
టెన్త్, ఇంటర్ పాసై ఇంటి దగ్గర ఖాళీగా ఉన్న యువతకు ఇది సువర్ణవకాశం. అర్హులైన ప్రతి అభ్యర్థి ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. అగ్నివీర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్