J&K Apprentice vacancies: డిగ్రీ పాసై ఖాళీగా ఉన్న నిరుద్యోగులకు ఇది గూడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. జమ్ముకశ్మీర్ బ్యాంక్‌లో దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంక్ శాఖల్లో అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 278
విద్యార్హత: ఏదైనా డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది.
వయస్సు: 2025 జనవరి 1 నాటి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: అన్ రిజర్వ్ డ్ కేటగిరి అభ్యర్థులకు రూ.700, రిజర్వ్ డ్ కేటగిరి అభ్యర్థులకు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.
శిక్షణ కాల పరిమితి: 1 ఇయర్ ఉంటుంది.
స్టైఫండ్: నెలకు రూ.10,500
ఎంపిక విధానం: ఆన్ లైన్ రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా చేసుకొని ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేది: 2025 జనవరి 7
అర్హత ఉండి ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి.