BigTV English

Fact Check: కావ్యతో ICC బాస్‌.. ఫోటోలు వైరల్‌, అసలు సంగతి ఇది

Fact Check: కావ్యతో ICC బాస్‌.. ఫోటోలు వైరల్‌, అసలు సంగతి ఇది

Fact Check Jay Shah – Kavya Maran: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) అందుబాటులోకి వచ్చిన తర్వాత సాంకేతిక రంగంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. క్లిష్టమైన పనులన్నీ సునాయాసంగా చేసేలా కొత్త యాప్స్, టూల్స్ పుట్టుకొస్తున్నాయి. కొన్ని సంస్థలు అయితే హ్యూమనాయిడ్ రోబోట్ లను కూడా సిద్ధం చేశాయి. ప్రస్తుతం దీని ప్రాధాన్యత అనేక రంగాలలో పెరుగుతుంది.


Also Read: Shubman Gill – Rohit Sharma: టీమిండియాకు బిగ్‌ షాక్‌.. రోహిత్, పంత్ లేకుండా చివరి టెస్ట్ !

ఈ ఏఐ నేటి యువతకు అనేక అంశాలలో నైపుణ్యాలు పెంచుకోవడానికి ఎంతో సహాయపడుతుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానంపై సోషల్ మీడియా వేదికగా పాజిటివ్ అండ్ నెగిటివ్ చర్చలు కూడా జరిగాయి. అయితే దీనివల్ల నష్టాలు తప్ప లాభం లేదని పలువురు సోషల్ మీడియాలో వాదించగా.. మార్పును స్వాగతించాల్సిందేనని మరి కొంతమంది చెబుతున్నారు. అయితే ఈ ఏఐ టెక్నాలజీ సెలబ్రిటీలకు మాత్రం శాపంగా మారింది.


మంచికి వాడాల్సిన ఈ సాంకేతికతను కొందరు ఆకతాయిలు తప్పుడు పనులకు ఉపయోగిస్తున్నారు. ఈ టెక్నాలజీ ద్వారా నకిలీ ఫోటోలు, వీడియోలను సృష్టించి సెలబ్రిటీల పరువును బజారున పడేస్తున్నారు. ఇప్పటివరకు సినీ రంగానికే పరిమితమైన ఈ జాడ్యం.. ఇప్పుడు క్రీడారంగానికి కూడా అంటుకుంది. క్రీడాకారుల నకిలీ ఫోటోలు, వీడియోలను రూపొందిస్తూ కొంతమంది శునకానందం పొందుతున్నారు.

ఇటీవల భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీ, టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా పెళ్లి చేసుకున్నారని.. అంతేకాదు వెకేషన్ కి కూడా వెళ్లారంటూ ఈ ఏఐ సాయంతో కొన్ని నకిలీ ఫోటోలను క్రియేట్ చేసి వైరల్ చేశారు. చాలామంది అవి నిజమైన ఫోటోలేనని పొరపడ్డారు. కానీ ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఇవన్నీ నకిలీ ఫోటోలని, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని కథనాలు రాయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ టీమ్ ఓనర్ కావ్య మారన్ కూడా ఈ ఏఐ ద్వారా నకిలీ ఫోటోలు సృష్టించే ఆకతాయిల బారిన పడింది.

ఐసీసీ చైర్మన్ జై షా తో కావ్య మారన్ బీచ్ లో ఉన్నట్లుగా కొన్ని నకిలీ ఫోటోలను క్రియేట్ చేసి శునకానందం పొందుతున్నారు. ఈ ఫోటోలు వైరల్ గా కూడా మారాయి. దీంతో ఈ నకిలీ ఫోటోలపై సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నకిలీ ఫోటోలను క్రియేట్ చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. కళానిధి మారన్ – కావేరి కళానిధి దంపతుల కుమార్తె కావ్య మారన్.

Also Read: Australia Playing XI: 5వ టెస్టుకు కొత్త డేంజర్ ప్లేయర్ తో ఆసీస్… టీమిండియా ప్లేయర్ ఔట్ !

ఈమె 1992 ఆగస్టు 6న జన్మించింది. కావ్య తండ్రి సన్ గ్రూప్ చైర్మన్. కావ్య మారన్ తండ్రి కళానిధి మారన్ దివంగత మాజీ డిఎంకె అధినేత కరుణానిధి మనవడు. ఈమె 2018 నుండి హైదరాబాద్ ప్రాంచైజీ సీఈవోగా కొనసాగుతున్నారు. ఐపీఎల్ ఫ్రాంచైజీ తో పాటు సన్ గ్రూప్ సౌత్ ఆఫ్రికా టి-20 లీగ్ లో సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ పేరిట ఓ జట్టును కలిగి ఉంది. కావ్య గత రెండేళ్లుగా ఐపీఎల్ వేలంలో కీలక ఆటగాళ్లను జట్టులో చేర్చుకొని టీమ్ ని మరింత పటిష్టం చేశారు. ఇక గత నెలలో ఐసీసీ చైర్మన్ గా జై షా బాధ్యతలు స్వీకరించారు. ఆయన రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఐసీసీ చైర్మన్ గా ఎన్నికైన అతి చిన్న వయస్కుడిగా 36 ఏళ్ల జై షా నిలిచారు.

Related News

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Dhoni on Virat : కోహ్లీ పెద్ద జోకర్.. ధోని హాట్ కామెంట్స్ వైరల్!

Big Stories

×