Bharat Electronics Recruitment: బీకామ్, బీబీఏ, బీబీఎం ఫుల్ టైం డిగ్రీతో పాటు కంప్యూటర్ ఆపరేషన్స్‌లో నైపుణ్యం కలిగిన వారికి ఇది గుడ్ న్యూస్. భారత్ ఎలక్ట్రానిక్స్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.
భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుండి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసారి నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూసేద్దాం.
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 3
ఇందులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
వయస్సు: 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర SC, ST అభ్యర్థులకు మరో 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మరో 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: 150 మార్కులకు రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 2025 జనవరి 8
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 2025 జనవరి 29
దరఖాస్తు ఫీజు: భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుండి విడుదలయిన జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు జనరల్, EWS, OBC అభ్యర్థులకు రూ.295 ఫీజు చెల్లించాలి. ఇతర SC, ST, PWD అభ్యర్థులకు ఎలాంటి ఫీజు అవసరం లేదు. ఆన్లైన్ లోనే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
జీతం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.45,000 జీతం ఉంటుంది.స
Also Read: High Court Jobs: హైకోర్టులో జాబ్స్.. స్టార్టింగ్ జీతమే రూ.45,000..
ఉద్యోగానికి ఎంపిక చేసే విధానం:
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు క్రింది ప్రాసెస్ ద్వారా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
పార్ట్ 1 : జనరల్ అప్టిట్యూడ్ & అవేర్‌నెస్ పరీక్ష: ఇందులో 50 మార్కులకు 50 ప్రశ్నలు వస్తాయి. జనరల్ మెంటల్ ఎబిలిటీ, అప్టిట్యూడ్, రీజనింగ్ టాపిక్స్ నుండి ప్రశ్నలు వస్తాయి.
పార్ట్ 2: టెక్నికల్ / ట్రేడ్ అప్టిట్యూడ్ : 100 మార్కులకి 100 ప్రశ్నలు జనరల్ ఇంగ్లీష్, టెక్నికల్, ప్రొఫెషనల్ లాంగ్వేజ్ నుండి ప్రశ్నలు వస్తాయి.
పరీక్షలో మెరిట్ మార్కులు పొందినవారిని ఉద్యోగానకి సెలెక్ట్ చేస్తారు.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.bel-india.in/
అర్హత ఉన్నఅభ్యర్థులందరూ ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థికి ప్రారంభంలోనే రూ.45,000 జీతం లభిస్తుంది. ఆసక్తి కలిగిన వారు వెంటనే అప్లికేషన్ పెట్టుకోండి. ఉద్యోగం సాధించండి ఆల్ ది బెస్ట్.