High Court Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ లా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. సివిల్ జడ్జెస్ (జూనియర్ డివిజన్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. రిక్రూట్ మెంట్ పూర్తి వివరాలను ఒకసారి చూసేద్దాం.
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 50
ఇందులో సివిల్ జడ్జెస్(జూనియర్ డివిజన్) ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద 40 పోస్టులు, రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ కింద 10 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు.
వయస్సు: 18 నుండి 35 సంవత్సరాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులకు, 18 నుండి 48 సంవత్సరాలు రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ పోస్టులకు వయో పరిమితి ఉండాలి.
విద్యార్హత: లా డిగ్రీ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
వేతనం: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉద్యోగాలకు సివిల్ జడ్జెస్ గా ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు రూ.45,000 జీతం ఉంటుంది. అన్ని రకాల అలవెన్సెస్, బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
ఉద్యోగ ఎంపిక విధానం: సివిల్ జడ్జెస్ పోస్టులకు అప్లికేషన్ చేసిన అభ్యర్థులకు ఒక్కటే రాత పరీక్ష నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు. రాత పరీక్షలో జనరల్ నాలెడ్జి, ఇంగ్లీష్, లా కి సంబంధించిన టాపిక్స్ నుండి ప్రశ్నలు వస్తాయి. ఎటువంటి నెగటివ్ మార్క్స్ ఉండవు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
Also Read: cbse Recruitment: CBSEలో ఉద్యోగాలు.. మంచి వేతనం.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అన్ని జిల్లాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. ప్రారంభ వేతనమే రూ.45,000 ఉంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.