Shah Rukh Khan : సినీ సెలబ్రిటీలపై పిచ్చి అభిమానం ఉండడం అనేది ఈరోజుల్లో సర్వసాధారణం. అయితే ఎవరైనా సరే సెలబ్రిటీలను ఇష్టపడితే ఏం చేస్తారు? ఏముంది… అభిమాన హీరో కదా అని ఆయన నటించిన సినిమాని మొదటి రోజు, మొదటి షో చూడాలనుకుంటారు. ఇంకాస్త ముందుకెళ్తే మూవీ థియేటర్ల దగ్గర టపాసులు పేల్చి ఒక పండగలా సెలబ్రేట్ చేసుకుంటారు. అంతేకాదు థియేటర్లలో అభిమానంతో చేసే రచ్చ మామూలుగా ఉండదు. డైహార్డ్ ఫ్యాన్స్ అయితే ఏకంగా తమ అభిమాన హీరోల పుట్టినరోజు నాడు రక్తదానం, అన్నదానం లాంటివి చేస్తూ ఉంటారు. మరి కొంతమంది వాళ్ళ పేర్లని లేదా బొమ్మల్ని టాటూగా వేయించుకుంటారు. కానీ ఓ మహిళ మాత్రం షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) మీద ఉన్న అభిమానంతో ఏం చేసిందో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు.
షారుక్ పేరు మీద కేఫ్
షారుక్ ఖాన్ (Shah Rukh Khan) కి కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఆయన చరిష్మా లేడీ ఫ్యాన్స్ ని ఇట్టే ఆకర్షిస్తుంది. తాజాగా ఓ లేడీ ఫ్యాన్ ఏకంగా షారుక్ ఖాన్ పేరు మీద కేఫ్ ని ఓపెన్ చేసింది. కోల్కతాలో ఓపెన్ చేసిన ఈ కేఫ్ ని షారుక్ ఖాన్ కి అంకితం కూడా చేసింది. ఈ కేఫ్ కోల్కతాలోని పార్క్ స్ట్రీట్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 10 నిమిషాల దూరంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఎవరు ఈ అభిమాని ?
ఈ లేడీ ఫ్యాన్ వయసు 24 ఏళ్లు. సమీరా గర్వ్ అనే ఈవిడ ఒక బిజినెస్ వుమన్. అందులో భాగంగానే తన తెలివిని ఉపయోగించి, ఏకంగా షారుక్ ఖాన్ పేరు మీద కేఫ్ ను ఓపెన్ చేసింది. జస్ట్ పేరు పెట్టడం మాత్రమే కాదు ఆ కేఫ్ ని చూశారంటే కచ్చితంగా దిమ్మ తిరగాల్సిందే. అందులో షారుక్ ఖాన్ హీరోగా నటించిన పలు సినిమాలతో పాటు ఆయన ఐకానిక్ ఫోజులతో ఉన్న ఫోటోలని గోడలపై మ్యూజియంలా అతికించి పెట్టింది. అంతేకాదు ఆ కేఫ్ మొత్తాన్ని షారుక్ ఖాన్ పాటలు, డైలాగులతో నింపేసింది.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే కేఫ్ లో షారుక్ (Shah Rukh Khan) పేరుతో ఒక ప్రత్యేకమైన మెనూ కూడా ఉందట. అందులో షారుక్ కు ఇష్టమైన వంటకాలు ఉన్నట్టు సమాచారం. షారుక్ ఖాన్ గురించి ఈ లేడీ ఫ్యాన్ మాట్లాడుతూ తను చిన్నప్పటి నుంచి షారుక్ ఖాన్ మాత్రమే ఇష్టపడుతున్నానని ఈ సందర్భంగా వెల్లడించింది. షారుక్ ఖాన్ పై తన అన్ కండీషనల్ లవ్ ను వ్యక్తం చేయడానికి తాను ఈ దారిని ఎంచుకున్నానని, తను షారుక్ డైహార్డ్ ఫ్యాన్ అని చెప్తోంది ఈ అమ్మడు. మరి ఈ విషయం తెలిసి షారుక్ ఒక్కసారైనా ఆ కేఫ్ ని విజిట్ చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ కేఫ్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
#ShahRukhKhan #cafe pic.twitter.com/r0SfOPk43y
— Diksha Sharma (@DikshaS17150327) January 9, 2025