IND vs Eng 3rd ODi: టీమ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ( India vs England livestream )మధ్య జరుగుతున్న.. మూడవ వన్డే మ్యాచ్ లో ఫ్యాన్స్ కు ఊహించని షాక్ తగిలింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ సేవలకు అంతరాయం కలిగింది. హాట్ స్టార్ లో ( Disney+ Hotstar ) చూసే… అభిమానులకు లైవ్ మ్యాచ్… కవరేజ్ సరిగా రాలేదు. అదే సమయంలో.. కేవలం హిందీ కామెంట్రీ మాత్రమే… రావడం జరిగింది. తెలుగు లేదా ఇంగ్లీష్.. అది కాకపోతే వేరే భాషలోకి… వెళ్లి మ్యాచ్ చూడాలన్న ఆప్షన్ కూడా తీసివేసింది హాట్ స్టార్ ( Disney+ Hotstar ).
Also Read: Great Khali: పాపం…పెట్రోల్ బంక్ లో పని చేస్తున్న ఖలీ… వీడియో వైరల్ !
17 భాషలు హాట్ స్టార్ లో ( Disney+ Hotstar )… చూపిస్తున్నాయి. కానీ టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ మాత్రం… కేవలం హిందీ భాషలోనే వచ్చింది. భారత క్రికెటర్లు బ్యాటింగ్ చేస్తున్న సమయంలోనే.. ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా.. ఫ్యాన్స్ సీరియస్ అయ్యారు. అసలు టీమ్ ఇండియా స్కోర్ ఎంత కొట్టింది..,? టీమిండియా ప్లేయర్లు ఎవరు ఆడుతున్నారో తెలియని పరిస్థితి నెలకొందని.. హిందీ కామెంట్రీ కి సంబంధించిన ఫోటోలను అలాగే స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
దీంతో ట్విట్టర్ అకౌంట్లో… హాట్ స్టార్ డౌన్ ( Hotstar Down )అంటూ ఓ హ్యాష్ టాగ్ కూడా వైరల్ అవుతుంది. అయితే ఇది గమనించిన హాట్ స్టార్ యాజమాన్యం… వెంటనే తమ తప్పిదాన్ని గుర్తించింది. యధావిధిగా అన్ని భాషల్లో కామెంట్రీ వచ్చేలా… సర్వీస్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది హాట్ స్టార్ ( Disney+ Hotstar ) యాజమాన్యం. దీంతో… ఫ్యాన్స్ అందరూ కాస్త కూల్ అయ్యారు. ఇప్పుడు ఈ సంఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. అటు మ్యాచ్ క్వాలిటీని కూడా సెట్ చేసింది హాట్ స్టార్. మరి కొంత మంది అభిమానులు హాట్ స్టార్ ( Disney+ Hotstar ) అసలు లాగినే కావడం లేదని పోస్టులు పెట్టారు. ఇక ఈ టార్చర్ భరించలేక… యాజమాన్యం దిగి వచ్చి… సమస్యను పరిష్కరించడం జరిగింది.
ఇది ఇలా ఉండగా… టీమ్ ఇండియా ( India ) వర్సెస్ ఇంగ్లాండ్ ( England ) మధ్య జరుగుతున్న.. మూడవ వన్డే మ్యాచ్ లో రోహిత్ శర్మ సేన భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్ లో నిర్ణిత 50 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయిన ఇండియా 356 పరుగులు చేయగలిగింది. దీంతో… ఇంగ్లండ్ టార్గెట్ 357 పరుగులుగా నిర్ణయించింది రోహిత్ శర్మ సేన. నిర్ణిత 50 ఓవర్లలో ఆ లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంటుంది. ఇక అటు టీమిండియా జట్టులో సెంచరీతో చెలరేగాడు శుభ్‌మన్ గిల్. ఈ ఫైనల్ మ్యాచ్ లో 112 పరుగులు చేసి..దుమ్ములేపాడు శుభ్‌మన్ గిల్. అలాగే…. శ్రేయస్ అయ్యర్ 78 పరుగులు, విరాట్ కోహ్లీ 52 పరుగులు చేసి…ఇద్దరూ హాఫ్ సెంచరీలతో రాణించారు.
Also Read: ICC ODI Batsmen Rankings: ర్యాంకింగ్స్ లో దుమ్ములేపిన గిల్, రోహిత్.. దిగజారిన కోహ్లీ..!
Dear @DisneyPlusHS how change the commentary language for #INDvENG match.. Atleast by default it should be English.. what is point of paying subscription 🤷🏼
When i click on audio option just a blank screen coming.#Hotstar @StarSportsIndia pic.twitter.com/QdPCqLfs7d
— Kasiviswanathan (@nkasi006) February 12, 2025
In 3rd ODI hotstar be like: there are 17 languages but you have watch it in hindi only saaarrr….#hotstar pic.twitter.com/B7IMduFku9
— addi (@abhi_dubey1808) February 12, 2025