TG Ed.CET: తెలంగాణ ఉన్నత విద్యా మండలి కీలక ప్రకటన జారీ చేసింది. తెలంగాణ పీఈ సెట్, ఎడ్ సెట్ షెడ్యూల్‌ను ఉన్నత అధికారులు రిలీజ్ చేశారు. రాస్ట్రంలో బీఈడీ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి టీఎస్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఎడ్ సెట్)2025 నోటిఫికేషన్ ను తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిలీజ్ చేసింది. ఈ సంవత్సరం పరీక్షలను కాకతీయ యూనివర్సిటీ నిర్వహించనుంది. అప్లికేషన్ ప్రక్రియ మార్చి 12 నుంచి మే 13 వరకు కొనసాగుతోంది. జూన్ 1న ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో ఎడ్ సెట్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. డిగ్రీ పాసై ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అవుతారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read: BREAKING: వారికి CM రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్.. మళ్ల గిట్ల రిపీట్ అయితే..?
తెలంగాణ రాష్ట్ర ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెనస్ టెస్ట్- 2025 షెడ్యూల్ ను కూడా రిలీజైంది. ఈ పరీక్షలను పాలమూరు యూనివర్సిటీ కండక్డ్ చేయనుంది. దీని ద్వారా బీపీఈడీ అండ్ యూజీడీపీఈడీ కోర్సులను అందించనుంది. మార్చి 12న నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. 2025-26 ఏడాదికి గానూ ప్రవేశాలు పొందేందుకు అర్హులైన అభ్యర్థులు మార్చి 15 నుంచి మే 24 వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అపరాధ రుసుంతో దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు మే 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి పేర్కొంది. జూన్ 11 నుంచి 14 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి.