Australian BHP Iron Ore Train: సాధారణంగా రైళ్లు ఎంత పొడవు ఉంటాయి? ప్రత్యేకంగా ఇంత పొడవు ఉండాలనే రూల్ ఏమీ లేదు. ఆయా రూట్లలో ఉన్న రద్దీని ఆధారంగా చేసుకుని రైళ్లకు కోచ్ లు ఏర్పాటు చేస్తారు. కొన్నింటికి వంద కోచ్ లు కూడా ఉంటాయి. ప్యాసింజర్ రైళ్లతో పోల్చితే గూడ్స్ రైళ్లు చాలా పొడవుంటాయి. ఇండియాలో అత్యంత పొడవైన రైలుగా ‘సూపర్ వాసుకి’ గుర్తింపు తెచ్చుకుంది. ఈ రైలుకు ఏకంగా 295 వ్యాగన్లు ఉంటాయి. పొడవు 3.5 కిలో మీటర్లు ఉంటుంది. 6 ఇంజిన్లను కలిగి ఉంటుంది.. ఈ రైలు వెళ్తుంటే వ్యాగన్లు లెక్కబెడితే కళ్లు గిరగిరా తిరుగుతాయి. గూడ్స్ రవాణాకు ఉపయోగించే ఈ ట్రైన్, రైల్వే క్రాసింగ్ దాటాలంటే చాలా టైమ్ తీసుకుంటుంది. ఒకేసారి ఈ రైలు 27 వేల టన్నుల బొగ్గును రవాణా చేస్తుంది.
ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు
ఇక ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు ఆస్ట్రేలియాలో ఉంది. దీని పేరు BHP ఐరన్ ఓర్ రైలు. ఏకంగా 7.3 కిలో మీటర్లు ఉంటుంది. ఇంజినీరింగ్ అద్భుతానికి ఈ రైలును ఉదాహారణగా చెప్పుకోవచ్చు. పశ్చిమ ఆస్ట్రేలియాలోని పిల్బారా ప్రాంతంలో నడుస్తున్న ఈ రైలుకు ఏకంగా 682 వ్యాగన్లు ఉంటాయి. దీనికి 8 ఇంజిన్లు ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలుగా గ గిన్నిస్ బుక్ ఆఫర్ వరల్డ్ రికార్డ్ సాధించింది. జూన్ 21, 2001లో ఈ రైలు గిన్నిస్ గుర్తింపు అందుకుంది.
ఇనుప ఖనిజ రవాణాకు ఉపయోగిస్తున్న ఆస్ట్రేలియా
ఈ రైలును ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇనుప ఖనిజాన్ని రవాణా చేయడానికి ఉపయోగిస్తున్నది. ఈ భారీ రైలు మౌంట్ న్యూమాన్ నుంచి పోర్ట్ హెడ్ ల్యాండ్ వరకు సుమారు 426 కిలో మీటర్ల పొడవున్న మార్గంలో నడుస్తుంది. ఇంత పొడవైన రైలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించేందుకు ఏకంగా 8 లోకో మోటివ్ లు పని చేస్తాయి. రైలు 7 కిలో మీటర్లకు పైగా పొడవు ఉన్నప్పటికీ పట్టాలు తప్పకుండా ఇంజినీర్లు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. భద్రత పరంగానూ ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు.
Read Also: దేశంలో 1వ నెంబర్ ప్లాట్ ఫారమ్ లేని ఏకైక రైల్వే స్టేషన్.. ఏ రాష్ట్రంలో ఉందో తెలుసా?
BHP ఐరన్ ఓ ర్ రైలు ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థకు జీవనాడిగా గుర్తింపు తెచ్చుకుంది. పిల్బారా గనుల నుంచి దీని ద్వారా ఇనుమ ఖనిజం ఎగుమతి చేస్తారు. ప్రపంచ ఉక్కు ఉత్పత్తిలో ఆస్ట్రేలియా కీలక పాత్ర పోషిస్తున్నది. ఆస్ట్రేలియా ఆర్థిక వృద్ధికి ఐరన్ ఓర్ గణనీయంగా దోహదపడుతుంది. వెలికి తీసిన ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేయడంలో BHP రైలు కీలక పాత్ర పోషిస్తున్నది. అత్యంత సవాళ్లను తట్టుకుంటూ ముందుకు సాగుతున్నది. ఈ రైలు మెయింటెనెన్స్ చూసేందుకు ఓ ప్రత్యేక ఇంజినీర్ల బృందాన్నే ఏర్పాటు చేసింది ఆస్ట్రేలియా బృందం.
Read Also: రైలు బోగీల మీద ఉండే A,S, E, HA పదాలకు అర్థం ఏంటి? దేని కోసం అలా రాస్తారో తెలుసా?