Railway Rules: మీరు రైలులో ప్రయాణిస్తున్నారా.. మొబైల్ ఛార్జింగ్ తగ్గిందని, వెంటనే ట్రైన్ సాకెట్ దగ్గరికి వెళుతున్నారా.. అయితే ఈ రూల్స్ తెలుసుకోండి. లేకుంటే మీ ఫోన్ హాంఫట్ కావచ్చు. లేకుంటే పెద్ద ప్రమాదమే జరిగే అవకాశం ఉందంటున్నారు రైల్వే అధికారులు. ఔను.. రైలులో మొబైల్ ఛార్జింగ్ పెట్టే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. లేకుంటే.. ఇబ్బందులు తప్పవు సుమా!
సాధారణంగా సుదూర ప్రాంతాలకు ప్రయాణించేందుకు మనకు రైలు ప్రయాణం అనుకూలం. అందుకే ఎవరైనా అటువంటి ప్రయాణాలకు రైలునే ఎంచుకుంటారు. అలా ప్రయాణించే సమయంలో.. ఇప్పటి కాలంలో మన వెంట తప్పక మొబైల్ ఫోన్ ఉండాల్సిందే మరి. మొబైల్ ఫోన్ వ్యక్తులు నేటికీ.. ఇంకా అక్కడక్కడా ఉన్నారనుకోండి. అయితే రైలులో ప్రయాణించే సమయంలో మొబైల్ ఫోన్ మన చేతిలో ఉంటే.. మనం సినిమాలు చూస్తాం.. గేమ్స్ ఆడేస్తాం. ఆ తర్వాత ఛార్జింగ్ సాకెట్ కోసం వెతికేస్తాం.
ఇలాంటి సమయంలోనే ప్రయాణికులు కొన్ని రూల్స్ పాటించాలని రైల్వే సూచిస్తోంది. రాత్రి వేళ మొబైల్ ఛార్జింగ్ పెట్టే వారు ఈ నిబంధన తప్పక పాటించాలట. చాలా వరకు రాత్రి వేళ.. రైలులో ప్రయాణించే వారు అలాగే మొబైల్ ఫోన్ ఛార్జింగ్ ఉంచేస్తారు. అదే కొత్త చిక్కులు తెస్తుందని రైల్వే అంటోంది. సాధారణంగా మనం గృహాలలో ఉపయోగించే కరెంట్.. ఆల్టర్నేటివ్ కరెంట్. అదే రైలులో ఉపయోగించే కరెంట్.. డైరెక్ట్ కరెంట్.
దీనితో రైలులో ఒక్కొక్కసారి అధికంగా విద్యుత్ ప్రసారం సాగుతుంది. మరొకసారి తక్కువగా ప్రసారం సాగుతుంది. రాత్రి వేళ అలాగే మొబైల్ ఛార్జింగ్ ఉంచిన సమయంలో.. దీనితో మొబైల్ ఫోన్ పేలే అవకాశాలు కూడ ఎక్కువగా ఉన్నాయట. అందుకే రైలులో చిన్నటి అక్షరాలతో ఓ సూచన కూడ రాసి ఉంటుంది. రాత్రి 11 నుండి ఉదయం 5 గంటల వరకు ఛార్జింగ్ అలాగే ఉంచరాదని దాని అర్థం.
Also Read: జగన్ మోసం చేసారంటున్న ఆ నేత.. ఈ కామెంట్స్ వెనుక అసలు కథ ఇదేనా?
అత్యవసరమైతే 30 నిమిషాలు అలా ఛార్జింగ్ పెట్టవచ్చని, కానీ ఇంట్లో మాదిరిగా రాత్రంతా మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టడం రైలులో సురక్షితం కాదట. అధికంగా కరెంట్ సరఫరా సమయంలో.. ఫోన్ పేలడం వంటి ఘటనలు జరుగుతాయని, ఈ విషయాన్ని గమనించి ప్రయాణికులు సహకరించాలని రైల్వే కోరుతోంది. మనతో పాటు ఉన్న ప్రయాణికుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రైల్వే రూల్స్ పాటిద్దామా మరి!