E-Paper
Advertisement

Inzamam-ul-Haq: 58 బంతుల్లో నేనైతే 200 కొడ‌తా…కానీ కోహ్లీ సెంచ‌రీ చేసి ఓవ‌రాక్షన్ చేస్తున్నాడు !

Inzamam-ul-Haq: 58 బంతుల్లో నేనైతే 200 కొడ‌తా…కానీ కోహ్లీ సెంచ‌రీ చేసి ఓవ‌రాక్షన్ చేస్తున్నాడు !
Advertisement

Inzamam-ul-Haq:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో (Indian Premier League 2026 Tournament) భాగంగా నిన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కేకేఆర్ (Royal Challengers Bengaluru vs Kolkata Knight Riders) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ఏకంగా ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకొని, పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి దూసుకు వెళ్ళింది. అయితే ఈ మ్యాచ్ లో 58 బంతుల్లో విరాట్ కోహ్లీ సెంచరీ ( virat Kohli century) నమోదు చేయడంపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ ( Inzamam-ul-Haq) సెటైర్లు పేల్చారు. 58 బంతులు ఆడిన విరాట్ కోహ్లీ ఒక్క సెంచరీ చేసి ఓవరాక్షన్ చేస్తున్నాడని మండిపడ్డారు. తానైతే డబ్బులు సెంచరీ చేసే వాడిని అంటూ కౌంటర్ ఇచ్చారు ఇంజమం. చాలా స్లోగా విరాట్ కోహ్లీ ఆడుతున్నాడని… ఇలాంటి వాళ్లు టి20లకు పనికిరారని బాంబు పేల్చారు ఇంజమామ్-ఉల్-హక్.

Also Read: Litton Das On Mic: రిజ్వాన్ కు ఆడ‌రాదు..త్వ‌ర‌గా ఔట్ చేయండి, వాడు మ‌ళ్లీ పాకిస్తాన్ లో అడుగుపెట్టొద్దు

58 బంతుల్లో 200 కొడ‌తా…కానీ కోహ్లీ సెంచ‌రీ చేసి ఓవ‌రాక్షన్ చేస్తున్నాడు

Advertisement

కేకేఆర్ పై 58 బంతుల్లో విరాట్ కోహ్లీ సెంచరీ చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ విషం కక్కే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ ( Inzamam-ul-Haq) కూడా స్పందించారు. టి20 ఫార్మాట్ కు విరాట్ కోహ్లీ ఏ మాత్రం సరిపోడని బాంబు పేల్చారు. టి20 అంటేనే సిక్సర్లు అలాగే బౌండరీలు అని గుర్తు చేశారు. కానీ విరాట్ కోహ్లీ సింగిల్స్ తీసుకుంటూ సొంత రికార్డుల కోసం ప్రయత్నం చేస్తుంటాడని ఆగ్రహించారు. 58 బంతులు ఎదుర్కొని సెంచరీ చేయడం పెద్ద గొప్ప అనుకుంటున్నాడని.. వేరే వాళ్ళు అయితే డబుల్ సెంచరీ చేస్తారని తెలిపారు. తాను కూడా 58 బంతులు ఎదుర్కొంటే కచ్చితంగా 200 కొడతానని సవాల్ విసిరారు. టి20 లో కంటే టెస్టుల్లో విరాట్ కోహ్లీ ఆడితే బెటర్ అని సూచనలు చేశారు.

కేకేఆర్ పై బెంగళూరు బంపర్ విజయం

కోల్కత్తా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య నిన్న రాయ్ పూర్ వేదికగా కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. ఇందులో కేకేఆర్ మొదటి బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నాలుగు వికెట్ల నష్టానికి 192 పరుగులు సాధించింది కేకేఆర్. ఈ లక్ష్యాన్ని 19.1లో 4 వికెట్ల నష్టానికి చేదించింది ఆర్సిబి. దీంతో పాయింట్లు పట్టికలో మొదటి స్థానంలోకి బెంగళూరు దూసుకు వెళ్ళింది. ఈ మ్యాచ్ లో 60 బంతుల్లో 105 పరుగులు సాధించాడు విరాట్ కోహ్లీ. ఇందులో మూడు సిక్సర్లు అలాగే 11 బౌండరీలు ఉన్నాయి.

Advertisement

Also Read: Litton Das On Mic: రిజ్వాన్ కు ఆడ‌రాదు..త్వ‌ర‌గా ఔట్ చేయండి, వాడు మ‌ళ్లీ పాకిస్తాన్ లో అడుగుపెట్టొద్దు (Indian Premier League 2026 Tournament)

 

 

Related News

PCB మ‌రో దిక్కుమాలిన కండీష‌న్‌.. ‘పాడెల్’ ఆడితేనే జ‌ట్టు ఛాన్స్‌

ఐపీఎల్ ప‌ర‌మ చెత్త లీగ్…అందులో ఆడ‌టం కంటే, ఇంట్లో కూర్చోండి

స్పెయిన్ ఆట‌గాడి నిర్ల‌క్ష్యం..కింద ప‌డి రెండు ముక్క‌లైన‌ ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోఫీ?

కొంప‌ముంచిన ధర్మేంద్ర ప్రధాన్…గంభీర్ మెడ‌పైకి క‌త్తి? ఢిల్లీలో కొత్త టెన్ష‌న్‌

ఓరేయ్ వైభ‌వ్..నువ్వు మ‌గాడివైతే జింబాబ్వేపై సెంచ‌రీ కొట్టు !

బౌలింగ్ స‌రిగ్గా చేయ‌లేద‌ని ధోని ప‌చ్చిబూతులు తిట్టాడు, లైవ్ మ్యాచ్ లోనే అవ‌మానించాడు

AB డివీలియర్స్ లాగా ఆడి, టీమిండియాను చిత్తుగా ఓడిస్తా

టీమిండియా చేతిలో ఓడినందుకు మాపై కుళ్ళిన గుడ్లు, టమోటాలు విసిరారు

Big Stories

Advertisement
×