NASSCOM PRIME CAREER FAIR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు ఇది భారీ గుడ్ న్యూస్. మంత్రి నారా లోకేష్ నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త చెప్పారు. విశాఖపట్నంలోని గీతం వర్సిటీ వేదికగా నిర్వహించే అతిపెద్ద కెరీర్ ఫెయిర్ (NASSCOM PRIME CAREER FAIR) లో నిరుద్యోగు అభ్యర్థులు హాజరు కావాలని కోరారు. దాదాపు 49 అగ్రశ్రేణి ఐటీ, ఐటీ బేస్ డ్ కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయని చెప్పారు.
ఈ 49 అగ్రశ్రేణి ఐటీ, ఐటీ బేస్ డే కంపెనీల్లో పది వేలకు ఉద్యోగ అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా ఈ కెరీర్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్టు ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఈ కెరీర్ ఫెయిర్ పోస్టర్ ను ఆయన రిలీజ్ చేశారు.
ALSO READ: Group-D Jobs: 32000 ఉద్యోగాలకు ఇంకా రెండు రోజులే మిత్రమా.. ఆలస్యం వద్దు..!
ఏపీ ఉన్నత విద్యామండలి, ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థతో కలిసి నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (NASSCOM) ఈ మేళా కండక్ట్ చేస్తోంది. మార్చి 5, 6 తేదీల్లో వైజాగ్ లోని గీతం యూనివర్సిటీ వేదికగా కెరీర్ ఫెయిర్ ఉంటుందని మంత్రి తెలిపారు. 2024, 2025 పాస్డ్ అవుట్ (టెక్, ఆర్ట్స్, సైన్స్, ఐటీఐ, పాలిటెక్నిక్ అండ్ డిప్లొమా) విద్యార్థులు ఈ కెరీర్ ఫెయిర్ కు హాజరు కావొచ్చని పేర్కొన్నారు. ముందు వచ్చిన వారికి తొలి ప్రాధాన్యం ప్రాతిపదికగా ఈ కెరీర్ ఫెయిర్ సాగనుంది. అభ్యర్థులు మార్చి 3 లోగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సి ఉంటుంది. భవిష్యత్తును తీర్చిదిద్దే ఈ అవకాశాన్ని యువత మిస్ చేసుకోవద్దని మంత్రి నారా లోకేష్ తెలిపారు.
అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. కెరీర్ ఫెయిర్ కు అటెంట్ అవ్వండి. ఆల్ ది బెస్ట్.
ALSO READ: Assam Rifles Recruitment: టెన్త్, ఐటీఐ, పాలిటెక్నిక్ అర్హతలతో భారీగా ఉద్యోగాలు.. లాస్ట్ డేట్ ఇదే..
కెరీర్ ఫెయిర్ తేది: 2025 మార్చి 5, 6
వేదిక: వైజాగ్, గీతం యూనివర్సిటీ
విద్యార్హత: 2024 అండ్ 2025 లో పాసైన అభ్యర్థులు హాజరు కావొచ్చు (టెక్, ఆర్ట్స్, సైన్స్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిప్లొమాలో పాసైన అభ్యర్థులు అటెంట్ అవ్వొచ్చు)
*ముందుగా వచ్చిన వారికే తొలి ప్రాధాన్యం ఉంటుంది.
రిజిస్ట్రేషన్ కు చివరి తేది: 2025 మార్చి 3
రిజిస్ట్రేషన్ లింక్: https://forms.gle/niCQZ89PVVB54vfh7