Assam Rifles Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. టెన్త్ క్లాస్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అర్హతలు ఉన్న అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం అనే చెప్పవచ్చు. అస్సాం రైఫిల్స్ డైరెక్టర్ జనరల్ ఆఫీస్ నుంచి టెక్నికల్ అండ్ ట్రేడ్స్ మేన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అస్సాం రైఫిల్స్ డైరెక్టర్ జనరల్ కార్యాలయం నుంచి అస్సాం రైఫిల్స్ టెక్నికల్ అండ్ ట్రేడ్స్ మ్యాన్ రిక్రూట్మెంట్ ర్యాలీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలన చూద్దాం.
ALSO READ: ECIL Recruitment: మన హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.65,000 జీతం.. ఇంకెందుకు ఆలస్యం..
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 215
– అర్హత ఉన్న పురుష, మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
-ఈ నోటిఫికేషన్ ద్వారా రెలీజియస్ టీచర్, రేడియో మెకానిక్, లైన్ మెన్ ఫీల్డ్, ఇంజనీర్ ఎక్విప్ మెంట్ మెకానిక్, ఎలక్ట్రీషియన్ మెకానిక్ వెహికల్, రికవరీ వెహికల్ మెకానిక్ , అప్హోల్స్టర్, వెహికల్ మెకానిక్ ఫిల్టర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్ , ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్, ప్లంబర్, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, ఎక్సరే అసిస్టెంట్, వెటర్నరీ అసిస్టెంట్, సఫాయి ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
వెకెన్సీ వారీగా పోస్టులు..
రెలీజియస్ టీచర్ – 03
రేడియో మెకానిక్ – 17
లైన్ మెన్ ఫీల్డ్ – 08
ఇంజనీర్ ఎక్విప్మెంట్ మెకానిక్ – 04
ఎలక్ట్రీషియన్ మెకానిక్ వెహికల్ – 17
రికవరీ వెహికల్ మెకానిక్ – 02
అప్హోల్స్టర్ – 08
వెహికల్ మెకానిక్ ఫిల్టర్ – 20
డ్రాఫ్ట్స్‌మ్యాన్ – 10
ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ – 17
ప్లంబర్ – 13
ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ – 01
ఫార్మసిస్ట్ – 08
ఎక్సరే అసిస్టెంట్ – 1
వెటర్నరీ అసిస్టెంట్ – 07
సఫాయి – 70
దరఖాస్తుకు చివరి తేది: మార్చి 22. (ఆలోగా అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు)
విద్యార్హత: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఉద్యోగాన్ని బట్టి టెన్త్ క్లాస్, ఐటీఐ , డిప్లొమా, డిగ్రీ వంటి అర్హతలు ఉంటే సరిపోతుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.100 ఫీజు చెల్లంచాలి. (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది)
రిక్రూట్మెంట్ ర్యాలీ డేట్స్: ఏప్రిల్ 3వ లేదా 4వ వారాల్లో ఈ ర్యాలీ నిర్వహించే అవకాశం ఉంది.
ఉద్యోగ ఎంపిక విధానం: పీఎస్‌టీ, పీఈటీ, రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ అనంతరం ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్దారించారు. భర్తీ చేసే ఉద్యోగాలకు కనీసం 18 నుండి గరిష్టంగా 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు అర్హులవుతారు.
అప్లికేషన్ లింక్: https://www.assamrifles.gov.in/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
ALSO READ: NIELIT Recruitment: బీటెక్ అర్హతతో సైంటిఫిక్ అసిస్టెంట్ జాబ్స్.. మంచి వేతనం.. లాస్ట్ డేట్ ఇదే..
ముఖ్యమైన సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 215
దరఖాస్తుకు చివరి తేది: 2025 మార్చి 22