DGCA New Directives: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) జారీ చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం.. ఇప్పుడు విమాన టికెట్ బుక్ చేసుకున్న వెంటనే, ప్రయాణిలకు ఎలాంటి సందేహాలకు తావు లేకుండా.. వారి ఫోన్ కు SMS లేదా వాట్సాప్ ద్వారా సమాచారాన్ని పొందుతారు.
విమానయాన ప్రయాణికులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) సోమవారం విమానయాన ప్రయాణికులకు సంబంధించిన కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ప్రకారం.. ఇప్పుడు మీరు ఏదైనా విమానయాన సంస్థ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు.. ఎలాంటి సందేహాలకు తావు లేకుండా, ప్రయాణికుల హక్కులు, నియమాలు సౌకర్యాల గురించి SMS లేదా వాట్సాప్ ద్వారా మీకు పూర్తి సమాచారం అందుతోంది.
ALSO READ: Driving Side Effects: డైలీ 2 గంటలు డ్రైవింగ్ చేస్తే ఏమవుతుందో తెలుసా?
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) సూచనల ప్రకారం, అన్ని విమానయాన సంస్థలు టికెట్ బుకింగ్ చేసిన తర్వాత వెంటనే, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ప్రయాణీకుల చార్టర్ లో ఆన్‌లైన్ లింక్‌ను SMS లేదా వాట్సాప్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ఈ లింక్‌లో ప్రయాణీకుల నియమ, నిబంధనలు, అలాగే ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించిన సమాచారం అంతా అందుబాటులో ఉంటుంది.
ప్రయాణీకులకు సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని అయినా.. ఎయిర్‌లైన్ వెబ్‌సైట్ అలాగే టిక్కెట్‌లో కూడా ప్రముఖంగా ప్రస్తావించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) పేర్కొంది. విమాన ఆలస్యం.. లేదా టికెట్ రద్దు విషయంలో విమాన ప్రయాణికులు వాపసు కోసం ఏమి చేయాలి..? బ్యాగేజీకి సంబంధించిన నియమాలు, అలాగే అనేక ఇతర ముఖ్యమైన విషయాల గురించి ఇది క్లియర్ కట్ గా సమాచారాన్ని అందిస్తోంది.
ఎందుకంటే.. మామూలుగా ప్రయాణికులు విమానాల రద్దు, బోర్డింగ్ తిరస్కరణ, బ్యాగేజ్ మిస్సింగ్, బ్యాగేజ్ మిస్సింగ్ లాస్ సమయాల్లో సమస్యలు వస్తాయి. నానా ఇబ్బందులు పడుతుంటారు. చాలా మంది ప్రయాణికులకు ఆయా పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంటుంది. ఈ క్రమంలో తాజాగా డీజీసీఏ ఆదేశాలతో స్పష్టమైన సమాచారంతో పాటు ఫిర్యాదులను సైతం పరిష్కరించుకునే అవకాశం కలుగుతుంది.
ఈ మార్గదర్శకాల ద్వారా విమానం ఆలస్యం, విమానం రద్దు విషయంలో పరిహారం, బ్యాగేజీకి సంబంధించిన రూల్స్, ఇతర కీలకమైన సమాచారం ఈజీగా తెలుస్తుంది. డీజీసీఏ ఆదేశాల నేపథ్యంలో విమానయాన కంపెనీలు చాలా మార్పులు చేస్తున్నాయి. విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ఇప్పటికే ఈ ప్రక్రియను అమలులోకి తీసుకురాగా.. టికెట్ బుకింగ్‌తో పాటు ప్రయాణీకుల హక్కుల, నియమ, నిబంధనల గురించి సమాచారాన్ని పంపుతున్నది. ఇండిగో కూడా త్వరలోనే ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది.
ALSO READ: Jobs: సొంత రాష్ట్రంలో ఉద్యోగాలు.. రూ.32,000 జీతం.. కొన్ని గంటలే ఛాన్స్..