Diet to Loose Weight: ఊబకాయం సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు బరువు తగ్గేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. జిమ్‌కు వెళ్లి వర్కౌట్ చేయడం, వాకింగ్, ఫాస్టింగ్, కొత్త కొత్త డైట్‌లు ఫాలో అవ్వడం వంటివి చేస్తారు. అయినా సరే కొన్ని సార్లు బరువు తగ్గడం కష్టతరంగా మారుతుంది. అలాంటి వారు నెల రోజుల్లోనే బరువు తగ్గేందుకు సహాయపడే వైరల్ డైట్ ఫాలో కావడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
సౌత్ కొరియాకు చెందిన మోడల్ షెర్రీ ఈ డైట్ వల్లే కేవలం నెల రోజుల్లోనే 4 కిలోల బరువు తగ్గింది. తన వెయిట్ లాస్ జర్నీకి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అంత తక్కువ సమయంలో బరువు తగ్గిన తన ‘స్విచ్ ఆన్ డైట్’ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ స్విచ్ ఆన్ డైట్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని తొలగించేందుకు హెల్ప్ చేస్తుందని, గట్ హెల్త్‌ని రక్షిస్తుందని షెర్రీ తెలిపింది. తన లాగా మీరు కూడా వేగంగా బరువు తగ్గాలంటే ఈ వైరల్ స్విచ్ ఆన్ డైట్‌ని ఫాలో అయిపోండి..!
ఈ డైట్ ప్రారంభించే ముందు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. మొదటి వారంలో శరీరాన్ని డిటాక్సిఫై చేసి గట్‌ని రీసెట్ చేసేందుకు ఎక్కువగా ప్రోటీన్ షేక్స్, కూరగాయలు, అధికంగా ప్రోటీన్స్ ఉండే ఆహరం తీసుకోవాలి.
ALSO READ: గ్లోయింగ్ స్కిన్ కోసం టిప్స్
రెండో వారంలో తక్కువ ఆహారం తీసుకున్నా సరే అందులో అధికంగా ప్రోటీన్స్ ఉండేలా చూసుకోవాలి. మూడో వారంలో ఒక పూట ఉపవాసం ఉంటూ ఎక్కువ ప్రోటీన్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.
నాలుగో వారంలో శరీరంలోని ఫ్యాట్‌ను తొలగించడానికి ఉవాసం ఉంటూనే కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఇలా చేస్తే శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వు తొలగిపోతుందట.
అయితే ఈ డైటింగ్ చేసినప్పుడు ప్రోటీన్ షేక్స్, ఫ్యాట్ లేని చికెన్, గుడ్లు, బెర్రీలు, అరటిపండ్లు, చిలగడదుంపలు తీసుకోవచ్చు. కెఫిన్, మద్యం, ప్రాసెస్ చేసిన ఆహారం, చక్కెర తీసుకోవడం పూర్తిగా మానేయాలి. శరీరం తీరును బట్టి ఈ డైట్ రిజల్ట్స్ అందరిలో ఒకేలా ఉండకపోవచ్చు. ఈ రకమైన డైట్ స్టార్ట్ చేసే ముందు డైటీషియన్ సలహా తీసుకోవడం మంచిదని నిపుణుల సూచిస్తున్నారు.