ప్రతిరోజూ రెండు మూడు గంటలు కారు, బైక్ పై ప్రయాణం చేస్తూ, ఆఫీసులకు వెళ్లేవారు. ఎంతోమంది అయితే రోజుకు రెండు గంటల పాటు డ్రైవింగ్లో ఉండడం వల్ల మీ మోకాలి ఎముకపై ఎలాంటి ప్రభావాలు పడతాయో తెలుసుకోండి.
ఇంటి నుంచి ఆఫీసుకు బండి మీద, కారు మీద వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వీరు కనీసం రోజులో రెండు నుంచి మూడు గంటల పాటు డ్రైవింగ్ లోనే ఉంటారు. ఇది ఎలాంటి ప్రమాదకరంమైన పని కాదని అనుకుంటారు. ఒకే స్థానంలో కదలకుండా కూర్చుని వాహనం నడపడం వల్ల ఎముకలు ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కానీ ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు.
మీరు ప్రతిరోజు రెండు గంటలకు పైగా కారు లేదా బండిని డ్రైవ్ చేస్తూ ఉంటే మీ మోకాలు ఎముక క్షీణిస్తుంది. విపరీతమైన వాపు ఏర్పడుతుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు సరైన భంగిమలు కూర్చోకపోవడం, ఎక్కువసేపు ఒకే భంగిమలో ఉండడం వల్ల ఈ మోకాళ్ళ నొప్పి వచ్చే అవకాశం పెరుగుతుంది.
కారులో కూర్చంటే మోకాలి నొప్పి
సోఫాలో కూర్చోవడం కంటే కారులో ఎక్కువసేపు కూర్చోవడం మీ శరీరానికి కష్టంగా ఉంటుందని వైద్యులకు వివరిస్తున్నారు. డ్రైవింగ్ లో ఎక్కువసేపు ఒకే స్థితిలో కూర్చోవాల్సి వస్తుంది. దీనివల్ల కాలి దగ్గర ఉన్న మీ కండరాలు గట్టి పడిపోతాయి. డ్రైవింగ్ చేయడానికి చేసేందుకు ట్రాఫిక్ పైన ఎక్కువ దృష్టి పెడతారు. ఇది కూడా కండరాలు పట్టేయడానికి దారితీస్తుంది.
కారు నడిపేటప్పుడు పాదంతో క్లచ్, బ్రేక్ వంటివి పదేపదే నొక్కాల్సి వస్తుంది. ఇది కూడా మోకాళ్ళకి అనుసంధానంగా ఉండే ఎముకపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. ఆ మోకాళ్ళకి చికిత్స కూడా అవసరం పడుతుంది. మోకాలిలోని మృదులాస్తీ క్షీణించడం మరింత నొప్పికి దారితీస్తుంది.
ఎక్కువసేపు డ్రైవింగ్ చేయడం వల్ల మోకాలి నొప్పి తరచూ వచ్చి పోతూ ఉంటుంది. దీనికి కొన్ని వ్యాయామాలు, స్ట్రెచింగ్ చేయడం ద్వారా నొప్పిని తగ్గించుకోవచ్చు. కాళ్ళను చాపడం, ముడవడం వంటివి చేస్తూ ఉండాలి. ఇది మోకాళ్ళ కీళ్లలో ఉద్రిక్తతను తగ్గిస్తుంది. ప్రతిరోజు అరగంట పాటు ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
కారు సీటు సర్దుబాటు
వ్యాయామాలు చేయడం వల్ల మోకాలు ఎముకను కాపాడుకోవచ్చు. భవిష్యత్తులో గాయాల ప్రమాదాన్ని కూడా తగ్గించుకోవచ్చు. అలాగే మీ కారు సీటు మోకాళ్ళకి, వీపుకు మద్దతు ఇచ్చేలా,వెన్నెముక నిటారుగా ఉంచేలా సర్దుబాటు చేసుకోవాలి. బండిపై కూడా అలాగే నిటారుగా కూర్చోవాలి.
అలాగే కారు, బైక్ మీద వెళ్లేటప్పుడు సౌకర్యవంతమైన పాదరక్షలు ధరించాలి. హై హీల్స్ వంటివి వేసుకుంటే డ్రైవింగ్ కు ఆటంకం కలిగిస్తాయి. వీపు నొప్పి, మోకాళ్ళ నొప్పులు పెంచేస్తాయి.
కోల్డ్ కంప్రెస్ వంటివి మోకాలి పై పెట్టడం వల్ల కూడా కొంతవరకు మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవచ్చు. వ్యాయామం చేయకపోతే డ్రైవింగ్ వల్ల వచ్చే నొప్పులు విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. వైద్యుల సలహా మేరకు కొన్ని రకాల శారీరక వ్యాయామాలు కూడా చేయవచ్చు. కొన్ని యోగాసనాల ద్వారా కూడా మోకాళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
నీటిలో చిటికెడు పసుపు, చిన్న అల్లం ముక్క వేసి బాగా మరిగించుకోవాలి. ఆ నీటిని వడకట్టి తాగడం వల్ల మోకాళ్ల నొప్పులు చాలా వరకు తగ్గుతాయి. మోకాళ్ల నొప్పుల్ని తేలికగా తీసుకోకూడదు. మోకాలి కీళ్లలో మృదులాస్తి క్రమంగా అరిగిపోవడం మొదలవుతుంది. దీని వల్ల కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కీళ్లు బలహీనంగా మారితే మోకాలు లోపలి కణజాలం కూడా దెబ్బతింటుంది. మీరు ఎక్కువ కాలం ఆ నొప్పిని భరించలేరు.