BigTV English

Viral News: నా ఫోనే తీసుకుంటావా? లెక్చరర్ ను చెప్పుతో కొట్టిన స్టూడెంట్, వీడియో వైరల్!

Viral News: నా ఫోనే తీసుకుంటావా? లెక్చరర్ ను చెప్పుతో కొట్టిన స్టూడెంట్, వీడియో వైరల్!

Shoking Video: పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చి దిద్దడంలో గురువుల పాత్ర ఎంతో కీలకం. విద్యార్థులు బయట ఎలా ఉన్నా, విద్యాలయాల్లో గురువులంటే భయం, భక్తి కలిగి ఉంటారు. కానీ, ఈ రోజుల్లో టీచర్లు అంటే విద్యార్థులకు పూర్తిగా భయం లేకుండా పోయింది. తమ తల్లిదండ్రులు లక్షల రూపాయలు ఫీజులు పోసి చదివిస్తున్నారు. తాము ఎలా ఉన్నా అడిగేది ఎవరు? అన్నట్లు తయారవుతున్నారు. గురువులు అంటే కనీసం గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నారు. తాజాగా వైజాగ్ లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో.. సెల్ ఫోన్ ను తీసుకుందనే కోపంతో ఓ స్టూడెంట్ ఏకంగా మహిళా లెక్చరర్ ను చెప్పుతో కొట్టింది. ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


కాలేజీలో సెల్ ఫోన్  వాడొద్దన్న లెక్చరర్

వైజాగ్ లోని రఘు ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన ఓ విద్యార్థిన సెల్ ఫోన్ తీసుకుని కాలేజీకి వచ్చింది. ఫోన్ చూస్తూ క్లాస్ కు వెళ్తోంది. ఇది గమనించిన లేడీ లెక్చరర్ కాలేజీలో సెల్ ఫోన్ వాడకూడదంటూ లాక్కుంది. నా ఫోన్ తీసుకుంటావా? అంటూ ఆ విద్యార్థి రెచ్చిపోయింది. కాలేజీలో ఉన్న అనే విషయాన్ని మర్చిపోయి బూతులు మాట్లాడుతూ  ఏకంగా లెక్చరర్ ను చెప్పుతో కొట్టింది. “నా ఫోన్ తీసుకోవడానికి నువ్ ఎవతివే.. లం* దాన? ఇస్తావా? ఇవ్వవా? ఇవ్వకపోతే చెప్పు తీసుకొని కొడతా” అంటూ కాలికి ఉన్న చెప్పు తీసుకొని వెళ్లి మహిళా లెక్చరర్ ను కొట్టింది. దీంతో కాలేజీలో ఉన్న మిగతా విద్యార్థులు, అధ్యాపకులు షాకయ్యారు. వెంటనే విద్యార్థులు, లెక్చరర్స్ వారిని విడిపించారు. ఈ వీడియో కాసేపట్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.


విద్యార్థి తీరుపై నిప్పులు చెరుగుతున్న నెటిజన్లు

ఈ వీడియోను చూసి సదరు అమ్మాయిపై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. “ఆ అమ్మాయి కేవలం సెల్ ఫోన్ బానిస మాత్రమే కాదు. గతి తప్పిన ఆధునిక కుటంబాల పర్యవాసం” అంటూ ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. “పునాది నుంచి లోపాలు.. ప్రాథమిక నడవడిక దారితప్పుతున్న స్థితిలో” అంటూ మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “కొంత కాలం తర్వాత అంతరించిపోయే జాతి టీచర్ ఏమో అనిపిస్తుంది. ఇలాంటి ఘటనలు చూస్తుంటే.. పాఠం వినరు. గౌరవం లేదు. ఇంకేం చేస్తాం టీచర్ ఉద్యోగం అనిపిస్తుంది” అని మరో నెటిజన్ అభిప్రాయపడ్డాడు. “కేవలం మార్కులు, ర్యాంకులే చదువులనే స్థితికి దిగజారిన విద్యా వ్యవస్థలో కొత్త ఫలాలు. ఆ అమ్మాయి కంటే ఏ విలువలు నేర్పని సమాజానిది మొదటి తప్పు” అంటూ మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “సంస్కారం లేని పిల్లలతో పాటు సంస్కారం నేర్పని తల్లిదండ్రులది కూడా తప్పే అన్నాడు మరో నెటిజన్. “దండన లేని చదువులు దండగ” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “ఆ పిల్ల అలా ఎగబడుతుందంటే.. తల్లిదండ్రుల పెంపకం ఎలా ఉందో అర్థం అవుతోంది” అంటూ నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. “అదే చెప్పుతో ఆ అమ్మాయి తల్లిదండ్రులను కొడితే సమస్య పరిష్కారం అవుతుంది” అని మరో వ్యక్తి ఫైర్ అయ్యాడు.

Read Also: అమెరికాలో ఇన్ని అరాచకాలా? మీరు అస్సలు ఊహించలేని దారుణాలు.. జాబితే పెద్దదే!

Related News

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Rules In Village: ఇదేం దిక్కుమాలిన నియమాలు.. వ్యక్తిని తాకితే రూ.5000 జరిమానా! ఎక్కడో తెలుసా?

Street Food: నూనె ప్యాకెట్ కట్ చేయకుండా నేరుగా.. ఇక్కడ బజ్జీలు తింటే పాడెక్కడం ఖాయం!

Big Stories

×