Clinical Assistant Jobs: టెన్త్ క్లాస్, ఇంటర్, డిగ్రీ(బీఓటీ, ఆక్యుపేషనల్ థెరపీ, బీఏఎస్ఎల్‌పీ), పీజీ(పీజీడీఈ), బీఈడీ(ఐడీ, ఎస్ఎల్డీ, ఎండీ, ఏఎస్‌డీ, బీఆర్ఎస్, ఎంఎఆర్, బీఎంఆర్, బీఆర్‌టీ, పీజీడీడీటీ) అర్హత ఉన్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. స్వామి వివేకానంద నేషనల్ ఇన్ స్టిట్యూట్య్ ఆఫ్ రిహబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్(SVNIRTAR) లో కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఒడిశాలోని స్వామి వివేకానంద నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిహబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ (SVNIRTAR)లో క్లీనికల్ అసిస్టెంట్, క్లర్క్, వర్క్ సూపర్ వైజర్ లాంటి పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవకచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 27వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఓసారి నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూసేద్దాం.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 12
ఇందులో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ప్రొస్తేటిస్ట్ట్ & ఆర్థోటిస్ట్, క్లినికల్ అసిస్టెంట్(డెవలప్‌మెంటల్ థెరపిస్ట్), క్లినికల్ అసిస్టెంట్(స్పీచ్ థెరపిస్ట్), వర్క్ సూపర్ వైజర్, క్లర్క్/టైపిస్ట్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, ఎర్లీ ఇంటర్ వెన్షలిస్ట్, ఆడియో అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాతాలజిస్ట్, స్పెషల్ ఎడ్యుకేటర్, ట్రైన్ డ్ కరేజివర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
ఉద్యోగ ఖాళీల వారీగా..
ప్రొస్టేటిస్ట్ అండ్ ఆర్థోటిస్ట్-1
క్లినికల్ అసిస్టెంట్ (డెవలప్‌మెంట్ థెరపిస్ట్)-2
క్లినకల్ అసిస్టెంట్(స్పీచ్ థెరపిస్ట్)-1
వర్క్ సూపర్ వైజర్-2
క్లర్క్/టైపిస్ట్-1
ఆక్యుపేషనల్ థెరపిస్ట్-1
ఎర్లీ ఇంటర్ వెన్షలిస్ట్-1
ఆడియో అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాతాలజిస్ట్-2
స్పెషల్ ఎడ్యుకేటర్-1
ట్రైన్ డ్ కరేజివర్-1
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో టెన్త్ క్లాస్, ఇంటర్, డిగ్రీ(బీఓటీ, ఆక్యుపేషనల్ థెరపీ, బీఏఎస్ఎల్‌పీ), పీజీ(పీజీడీఈ), బీఈడీ(ఐడీ, ఎస్ఎల్డీ, ఎండీ, ఏఎస్‌డీ, బీఆర్‌ఎస్, ఎంఆర్, బీఎంఆర్, బీఆర్‌టీ, పీజీడీడీటీ)లో పాసై ఉండాలి. వర్క్ ఎక్స్ పీరియన్స్‌ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్దారించారు. ప్రొస్తేటిస్ట్ట్ & ఆర్థోటిస్ట్, క్లినికల్ అసిస్టెంట్(డెవలప్‌మెంటల్ థెరపిస్ట్), క్లినికల్ అసిస్టెంట్(స్పీచ్ థెరపిస్ట్), వర్క్ సూపర్ వైజర్, క్లర్క్/టైపిస్ట్‌లకు 56 ఏళ్లు, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, ఎర్లీ ఇంటర్‌వెన్షలిస్ట్, ఆడియో అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాతాలజిస్ట్, స్పెషల్ ఎడ్యుకేటర్‌కు 35 ఏళ్లు, ట్రైన్డ్ కరేజివర్‌కు 40 ఏళ్లు మించి ఉండరాదు.
వేతనం: ఉద్యోగాన్ని బట్టి జీతం కల్పిస్తారు. నెలకు ప్రొస్తేటిస్ట్ట్ & ఆర్థోటిస్ట్, క్లినికల్ అసిస్టెంట్(డెవలప్‌మెంటల్ థెరపిస్ట్), క్లినికల్ అసిస్టెంట్(స్పీచ్ థెరపిస్ట్)కు రూ.50,000, వర్క్ సూపర్ వైజర్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, ఎర్లీ ఇంటర్‌వెన్షలిస్ట్, ఆడియో అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాతాలజిస్ట్, స్పెషల్ ఎడ్యుకేటర్‌కు రూ.35,000, క్లర్క్/టైపిస్ట్‌కు రూ.25,000, ట్రైన్డ్ కరేజివర్‌కు రూ.20,000 వేతనం ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు పంపాల్సిన చిరునామా: ది డైరెక్టర్ స్వామి వివేకానంద నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిహబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్, ఓలత్‌పూర్, బైరోయ్, కటక్, ఒడిశా-754010 అడ్రస్‌కు దరఖాస్తును పంపాలి.
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఫిబ్రవరి 27
Also Read: Kiran Kumar Reddy on Kavitha: కవిత లిక్కర్ సామ్రాజ్య కేసులు రోజుకొకటి బయటపడుతున్నాయి: ఎంపీ చామల
ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.svnirtar.nic.in/