KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ అంటే తెలియని వారు ఉండరు. పాల్ ఏదైనా విమర్శ చేశారంటే చాలు అది వైరల్ కావాల్సిందే. రెండు తెలుగు రాష్ట్రాలలో పార్టీ స్థాపించిన సమయం నుండి, తనదైన శైలిలో రాజకీయ విమర్శలు చేయడంలో పాల్ దిట్ట. తాజాగా కేఏ పాల్ చేసిన రాజకీయ విమర్శలు సంచలనంగా మారాయి. అది కూడా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ పాల్, కామెంట్స్ చేయడం విశేషం.
బీఆర్ఎస్ పార్టీ మహిళా నేత, ఎమ్మెల్సీ కవితపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ సీరియస్ కామెంట్స్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా ప్రవర్తించడం బీఆర్ఎస్ పార్టీ నేతలకే సాధ్యమని కేఏ పాల్ అన్నారు.
నిజామాబాద్ జిల్లా సర్పంచులు సమావేశంలో ముఖ్యఅతిథిగా కేఏ పాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాల్ మాట్లాడుతూ.. కల్వకుంట కవిత సడెన్ గా బీసీ నినాదాన్ని ఎందుకు లేవనెత్తారు చెప్పాలంటూ ఆయన ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ లు బీసీలు కాదని, వారందరూ దొరలని కేఏ పాల్ కామెంట్ చేశారు. బంగారు తెలంగాణను బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పరిపాలనలో అప్పుల పాలు చేసిందన్నారు. కవిత తికమకకు గురై, బీసీల గురించి మాట్లాడుతున్నట్లు ఉందని కేఏ పాల్ అభిప్రాయపడ్డారు.
Also Read: Hyderabad City: హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్.. రేపు రాత్రి ఈ సర్వీస్ మీకోసమే!
కొంతమంది కేసీఆర్ ఫ్యామిలీని దొరలని సంబోధిస్తున్నారని, మరికొందరు దొంగలని అంటున్నట్లు కేఏ పాల్ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. రాష్ట్రాన్ని రూ. 7 లక్షల కోట్ల అప్పుల్లో ముంచిన ఘనత మాత్రం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఇప్పుడు బీసీ నినాదాన్ని ఎత్తుకున్న బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మవద్దని కేఏ పాల్ కోరారు. ఇప్పటికైనా బీసీ నాయకులు మేల్కొనాలని కేఏ పాల్ కోరడం విశేషం. కేఏ పాల్ ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసి కామెంట్స్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. పాల్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కల్వకుంట్ల కవితపై KA పాల్ ఫైర్
కవిత సడెన్ గా బీసీ నినాదం ఎందుకు ఎత్తుకుంది?
బహుశా కవిత కన్ఫ్యూజ్ అయ్యి బీసీల గురించి మాట్లాడుతునట్లు ఉంది
కొంతమంది ఆ ఫ్యామిలీని దొరలు అంటే, చాలా మంది మాత్రం దొంగలు అంటున్నారు
తెలంగాణ రాష్ట్రాన్ని రూ.7 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారు
ఇప్పుడు… pic.twitter.com/2OGXGKaJSC
— BIG TV Breaking News (@bigtvtelugu) December 30, 2024