New India Assurance: డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉన్నారా..? ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా..? అయితే ఈ జాబ్స్ డిటైయిల్స్ మీ కోసమే..
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NIACL) అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 500
దరఖాస్తుకు చివరి తేది: 2025 జనవరి 1 (జనవరి 17 నుంచి ఆన్ లైన్ అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది)
వయస్సు: న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు 21ఏళ్ల నుంచి 30ఏళ్ల మధ్య వయస్కులై ఉండాలి.
విద్యార్హత: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు 2024 డిసెంబర్ 1వ తేదీ నాటికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
అభ్యర్థులు ఏ రాష్ట్రంలో ఉద్యోగాలకు దరఖాస్తు అప్లై చేస్తున్నారో.. ఆయా రాష్ట్రాలకు సంబంధించిన స్థానిక భాషలపై అవగాహన, పట్టు తప్పనిసరిగా ఉండాలి.
జీతం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.40,000 జీతం లభిస్తుంది.
ఎంపిక ప్రక్రియ: ప్రాథమిక రాత పరీక్ష, ప్రధాన రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
Also Read:SBI Clerk Recruitment 2025: GOOD NEWS.. 13,735 ఉద్యోగాలు.. వారం రోజులే గడువు..
ముఖ్యమైన డేట్స్:
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 2024 డిసెంబర్ 17
దరఖాస్తు చివరి తేది: 2025 జనవరి 1