Pawan Kalyan about OG : సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా ఓ జి. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. సుజిత్ స్వతహాగా పవన్ కళ్యాణ్ అభిమాని కావడం దీనికి ప్లస్ పాయింట్. అంతేకాకుండా అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న స్ట్రైట్ సినిమా ఇది. పవన్ కళ్యాణ్ కెరియర్ లో గబ్బర్ సింగ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా విడుదలైనప్పుడు చాలామంది అభిమానులు నాని సుజిత్ కూడా పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరుచుకుంటూ బయటికి వచ్చాడు. పవన్ కళ్యాణ్ తో సినిమా ఓకే అవ్వగానే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సుజిత్ దర్శకత్వం వహించిన సాహో సినిమా కూడా విపరీతమైన కాంప్లిమెంట్లు వచ్చాయి. దాదాపు సినిమా రిలీజ్ అయిన ఐదేళ్లు తర్వాత పాజిటివ్ రివ్యూస్ వచ్చిన ఏకైక సినిమా సాహో అని కూడా అప్పట్లో కామెంట్స్ వినిపించాయి.
ఇకపోతే ఓజి సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ విపరీతమైన అంచనాలను పెంచింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని గ్యాంగ్స్టర్ రోల్ లో చూపించిన విధానం అద్భుతంగా వర్కౌట్ అయింది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు దాదాపు మూడు సినిమాలు చేస్తున్న కూడా ఓజి సినిమా మీద అందరికీ మంచి నమ్మకాలు ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రసంగం ఇచ్చిన ఇంకేమి చేసినా అన్ని చోట్ల కూడా ఓజీ ఓజీ అనే నినాదాలు వినిపిస్తూనే ఉంటాయి. అయితే దీనిపైన పవన్ కళ్యాణ్ చాలాసార్లు అసహనం వ్యక్తం చేశారు. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు అంటూ ఫ్యాన్స్ మీద చిరాకు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మరోసారి ఓజీ సినిమా గురించి ప్రస్తావని తీసుకొచ్చాడు పవన్. ఓజీ అనేది కేవలం అరుపులు మాత్రమే కాదు అవి బెదిరింపులు అంటూ నవ్వుతూ తెలిపాడు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కేవలం ఎనిమిది రోజులు మాత్రమే పెండింగ్ ఉంది. ఓజీ కంటే ముందు హరిహర వీరమల్లు సినిమా విడుదలవుతుంది. ఊస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా పూర్తయిపోయింది. అంటూ పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చాడు.
అయితే ఇవన్నీ సినిమాలు కంటే ఓజీ సినిమా గురించే ప్రేక్షకులు ఎక్కువ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తుంది అని పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా గట్టి నమ్మకంతో ఉన్నారు. మొత్తానికి హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయిన తరువాతే ఓజి సినిమా విడుదల అవుతుంది అని ఎట్టకేలకు పవన్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా అల్లు అర్జున్ ఇన్సిడెంట్ గురించి కూడా పవన్ స్పందించారు.
Also Read : Pawan Kalyan-Allu Arjun: కళ్యాణ్ కనిపించలేదు అన్నారు, కానీ ఈ రోజు కరెక్ట్ గా మాట్లాడాడు