BigTV English

Kannappa: ‘కన్నప్ప’ను ట్రోల్ చేస్తే శివుడి శాపం తగులుతుంది.. నటుడి కామెంట్స్‌కు ఆడియన్స్ రియాక్షన్

Kannappa: ‘కన్నప్ప’ను ట్రోల్ చేస్తే శివుడి శాపం తగులుతుంది.. నటుడి కామెంట్స్‌కు ఆడియన్స్ రియాక్షన్

Kannappa: ఒక సినిమాలో నటిస్తున్నారంటే కచ్చితంగా ఆ సినిమా హిట్ అవ్వాలని ప్రతీ నటీనటులు కోరుకుంటారు. వారు పడిన కష్టం, ఇచ్చిన టైమ్ అన్నీ ఆ సినిమా హిట్ కోసమే అయ్యింటుంది. హీరో, హీరోయిన్లు మాత్రమే కాదు.. ఒక మూవీ కోసం క్యారెక్టర్ ఆర్టిస్టులు సైతం కష్టపడి పనిచేస్తుంటారు. అలా మంచు విష్ణు హీరోగా, నిర్మాతగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘కన్నప్ప’ కోసం కూడా దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది స్టార్లతో పాటు తెలుగులోని ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్టులను కూడా ఒక దగ్గరికి చేర్చాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఏర్పాటు చేసిన స్పెషల్ ప్రెస్ మీట్‌లో నటుడు రఘు బాబు చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.


ప్రజలు స్మార్ట్

మంచు విష్ణు (Manchu Vishnu) మాత్రమే కాదు.. మంచు ఫ్యామిలీలో ఎవరు ఏం చేసినా ప్రేక్షకులు వారిని ట్రోల్ చేయడం అనేది చాలా కామన్. అలాగే తను తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘కన్నప్ప’పై కూడా ఇలాగే ట్రోల్స్ వస్తూ ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో విష్ణు ఏం మాట్లాడినా దానిపై నెగిటివ్ కామెంట్స్ చేస్తూ, ట్రోల్ చేస్తూ వాటిని వైరల్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. తాజాగా ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు విష్ణు తనపై వస్తున్న ట్రోల్స్‌పై స్పందించాడు. ప్రజలు కూడా స్మార్ట్ అయిపోయారని, ఎవరు ఎందుకు ట్రోల్ అవుతున్నారు, వారిని కావాలని ట్రోల్ చేస్తున్నారా అని వారు గ్రహిస్తున్నారని చెప్పుకొచ్చాడు. అదే సమయంలో రఘు బాబు కూడా ‘కన్నప్ప’పై వ్యాఖ్యలు చేశాడు.


శాపానికి గురవుతారు

టాలీవుడ్‌లో ఎన్నో ఏళ్లుగా కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు రఘు బాబు. ఎన్నో సినిమాల్లో ఆయన యాక్టింగ్‌తో కంటపడి కూడా పెట్టించారు. అలాంటి రఘు బాబు తాజాగా ‘కన్నప్ప’ (Kannappa)పై వస్తున్న ట్రోల్స్‌పై స్పందించారు. ‘‘కన్నప్ప సినిమా గురించి ఎవరైనా ట్రోల్ చేశారంటే శివుడి ఆగ్రహానికి, శాపానికి గురవుతారు. గుర్తుపెట్టుకోండి. ఇది వంద శాతం నిజం. ఇంకా ట్రోల్ చేశారంటే మీ ఇష్టం’’ అని అన్నారు రఘు బాబు. ఈ కామెంట్స్ ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. సినిమాలు నచ్చితే వాటిని బ్లాక్‌బస్టర్ చేయడం, నచ్చకపోతే ట్రోల్ చేయడం ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది. కానీ ట్రోల్ చేసినందుకు శాపం తగులుతుంది అంటూ రఘు బాబు (Raghu Babu) అనడంతో ఇప్పుడు ఈ వీడియో తెగ ట్రోల్ అవుతోంది.

Also Read: అలా చేయకపోతే టాలీవుడ్‌లో ఉండలేం.. ప్రభాస్ బ్యూటీ అంత మాట అనేసిందేంటి.?

కరెక్ట్ కాదు

దేవుడి సినిమాలు చూడకపోతే, వాటిని ఆదరించకపోతే ఇలాంటి స్టేట్‌మెంట్స్ ఇవ్వడం మేకర్స్‌కు, నటీనటులకు కామన్ అయిపోయింది అంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయినా ట్రోల్ చేస్తేనే శాపం తగులుతుంది అనడం కరెక్ట్ కాదని ఫీలవుతున్నారు. ఇప్పటకే ‘కన్నప్ప’ సినిమాపై ఎన్నో ట్రోల్స్ వచ్చాయి, వస్తున్నాయి. ఇందులో అక్షయ్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు నటించారు. అసలు ఇంతమంది స్టార్ హీరోలను ఏం చెప్పి ఒప్పించావంటూ మంచు విష్ణును ట్రోల్ చేశారు నెటిజన్లు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×