Viral News: ప్రకృతి ప్రళయానికి ముందు అనేక సంకేతాలు కనిపిస్తాయి. జరగబోయే చెడును ముందుగానే తెలియజేసే ఘటనలు జరుగుతుంటాయి. వాటిని నిపుణులు మాత్రమే పసిగట్టే అవకాశం ఉంటుంది. లేదంటే. దశాబ్దాలుగా అక్కడే నిసాసం ఉంటున్న స్థానికులు ఈ విషయాలను అంచనా వేస్తుంటారు. తాజాగా యూకేలోనూ ఇలాంటి ఓ వింత ఘటన జరిగింది. జలకన్య అస్థిపంజరం బీచ్ లోకి కొట్టుకొచ్చింది. ఈ అస్థి పంజరం జరగబోయే చెడును సంకేతంగా స్థానికులు అంచనా వేస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయంతో వణికిపోతున్నారు.
బీచ్ లో వింత ఆకారాన్ని చూసిన జంట
తాజాగా యూకే బీచ్ లో నడుచుకుంటూ వెళ్తున్న ఓ జంట వింత ఆకారాన్ని చూశారు. మనిషికి రెక్కలు ఉన్నట్లుగా కనిపించింది. దానికి చేపలా తోక కూడా ఉండటాన్ని గమనించారు. వింతైన ఈ అస్థిపంజరాన్ని చూసి వెంటనే ఫోటోలు తీశారు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. పౌలా రీగన్ అనే తాజాగా తన భర్తతో డేవ్ తో కలిసి బీచ్‌లో వాకింగ్ కు వెళ్లింది. సరదాగా నడుస్తుండగా, కొద్ది దూరంలో ఓ వింత ఆకారం కనిపించింది. వెళ్లి చూసి షాకయ్యారు. దగ్గరకు వెళ్లి చూస్తే, తల భాగం అస్థిపంజరంలా, వెనుక భాగం చేప తోకలా ఉందని వెల్లడించింది. తన జీవితంలో ఎప్పుడూ అలాంటి ఆకారాన్ని చూడలేదని చెప్పింది. ముందుగా ఆ ఆకారాన్ని చూసి ఒడ్డుకు కొట్టుకొచ్చిన చెక్క అని భావించినట్లు చెప్పింది. కానీ, దగ్గరకు వెళ్లి చూస్తే వింత ఆకారం దర్శనం ఇచ్చిందని చెప్పింది. ఆ ఆకారం కూడా కుళ్లిపోయినట్లు కనిపించడం లేదని వివరించింది. తాము అక్కడకి వెళ్లి చూస్తుండగానే మరికొంత మంది అక్కడికి వచ్చారని చెప్పింది పౌలా. చాలా మంది ఆ వింత రూపాన్ని చూసినా కచ్చితంగా ఏంటో చెప్పలేకపోయారని వివరించింది. గతంలో ప్రళయానికి ముందు ఈ బీచ్ లో ఇలాంటి ఘటనలు జరిగినట్లు స్థానికులు చెప్తున్నారని చెప్పింది. అక్కడి వాళ్లు జరగబోయే చెడుకు సంకేతంగా భావిస్తున్నారని పౌలా వెల్లడించింది.
Read Also: సిమెంట్ వాడకుండానే ఇల్లు కట్టేశారు.. ఎలాగో తెలిస్తే దిమ్మతిరుగుద్ది!
సోషల్ మీడియాలో చర్చోప చర్చలు
ఈ వింత రూపాలను చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇది నిజంగానే జలకన్య ఆస్థి పంజరం అని కొందరు అంటుంటే, అదంతా ఉత్త ముచ్చటేనని మరికొంత మంది కామెంట్స్ పెడుతున్నారు. “ఇది నిజంగా జలకన్య ఆస్థిపంజరమా?” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “ఇది ఎవరో కావాలని చేసినట్లు కనిపిస్తోంది. ఎక్కడైనా ముక్కు, చెవులు కూడా ఎముకలతో ఉంటాయా?” అని మరికొంత మంది ప్రశ్నిస్తున్నారు. ఈ వింత ఆకారంపై సోషల్ మీడియాలో రకరకాలా చర్చలు జరుగుతున్నాయి. యూకేతో పాటు ప్రపంచ వ్యాప్తంగానూ ఈ ఫోటోలపై చర్చ కొనసాగుతోంది.
Read Also: రూ.40 వేల కేక్, 300 మందికి పార్టీ.. కళ్లు చెదిరేలా కుక్క బర్త్ డే సెలబ్రేషన్స్!