Telangana Govt: ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఉద్యోగాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఆర్టీసీలో దాదాపు 3 వేల పైచిలుకు పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి రేపో మాపో నోటిఫికేషన్ ఇవ్వనుంది.
ఆర్టీలో కొలువుల జాతర
ఆర్టీసీ లో 3038 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు ఆ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టీసీలో సుదీర్ఘ కాలం తర్వాత ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ ప్రారంభించడంతో హర్షం వ్యక్తం చేశారు. దాదాపు 3038 ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనిపై త్వరలో నోటిఫికేషన్ వెలువడనుంది. ఇందుకు సంబంధించి వెనుక పనులు వేగంగా జరుగుతున్నాయి. సాధ్యమైనంత త్వరగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలే ఇందుకు కారణమని తెలిపారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తుందని, దీనివల్ల ఆర్టీసీలో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిందన్నారు. ఇప్పటివరకు కోట్లాది మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారన్నారు. దీనివల్ల 5500 కోట్ల రూపాయలు ఆదా అయ్యిందన్నారు.
అన్ని విభాగాల్లో మూడు వేల పైచిలుకు
ఇప్పటికే మహా లక్ష్మి కోసం కొత్త బస్సులు కొనుగోలు చేశామని, ఇప్పుడు ఉద్యోగాల భర్తీకి ఆర్టీసీ అవుతుందన్నారు. మొత్తం ఆర్టీసీలో 3038 పోస్టుల భర్తీకి సన్నాహాలు చేస్తోంది. డ్రైవర్ -2000, శ్రామిక్ -743 డిప్యూటీ సూపరిండెంట్ (ట్రాఫిక్ విభాగం)-84, డిప్యూటీ సూపరిండెంట్ (మెకానికల్)-114 ఉన్నాయి.
ALSO READ: సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో జాబ్స్.. టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైతే చాలు
అలాగే డిపో మేనేజర్/ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్-25, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్-18, అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్)-23, సెక్షన్ ఆఫీసర్ (సివిల్)-11 ఉన్నాయి. ఇవికాకుండా అకౌంట్ ఆఫీసర్స్-6, మెడికల్ ఆఫీసర్స్ జనరల్-7 మెడికల్ ఆఫీసర్స్ స్పెషలిస్ట్-7 ఉండనున్నాయి. త్వరలో ఈ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనుంది. నిరుద్యోగులకు పెద్ద పీఠ వేస్తూ దాదాపు 60 వేలకు పైగా ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసింది.
భారీ స్థాయిలో ఉద్యోగాల నోటిఫికేషన్లు క్యాలండర్ ప్రకారం విడుదల చేయనుంది ప్రభుత్వం. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకొని, పరీక్షకు బాగా ప్రిపేర్ కావాలన్నారు. ఆర్టీసీలో చాలాకాలం తర్వాత ఉద్యోగాల భర్తీ జరుగుతుండడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్.