Constipation: మీరు కూడా మలబద్ధకంతో బాధపడుతున్నారా? గ్యాస్, అజీర్ణం, కడుపు బిగుతుగా ఉండటం వంటి సమస్యలు ఎదుర్కుంటున్నారా ? ఇలాంటి సమయంలో మందులు మాత్రమే వాడనవసరం లేదు. కొన్ని రకాల హోం రెమెడీస్ వాడటం వల్ల కూడా మీకు మంచి ఫలితం ఉంటుంది. తగిన మోతాదులో హోం రెమెడీస్ తీసుకోవడం వల్ల అద్భుత మైన ప్రయోజనాలు ఉంటాయి. జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గించడానికి ఎలాంటి హోం రెమెడీస్ వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మలబద్ధకం, అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్ ఏర్పడటం వంటి సమస్యల నుండి మీరు తక్షణమే ఉపశమనం పొందాలంటే.. జీర్ణ సంబంధిత సమస్యలన్నింటినీ వదిలించుకోవాలనుకుంటే.. మీ రోజును క్రమం తప్పకుండా సోంపు ,మెంతి నీటితో ప్రారంభించండి. ఈ ఆరోగ్యకరమైన నీటిని తాగడం ద్వారా మీరు అనేక ప్రయోజనాలను పొందుతారు. ఇది మీ జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. అంతే కాకుండా మలబద్ధకం, అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్ ఏర్పడటం, వంటి సమస్యల నుండి మీరు ఉపశమనం పొందవచ్చు. దీంతో పాటు.. ఈ నీరు మీ మొత్తం ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.
సోంపులో అనెథోల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది జీర్ణ ఎంజైమ్‌లను సక్రియం చేస్తుంది. సోంపు, మెంతులు ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలుగా ఉండటమే కాకుండా.. ఆయుర్వేద మందులుగా కూడా పని చేస్తాయి.. ఈ రెండింటిలోనూ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా వీటి వల్ల ఆహారం బాగా జీర్ణమవుతుంది. సోంపులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు గ్యాస్, అసిడిటీ , అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. 2022 సంవత్సరంలో నిర్వహించిన ఒక అధ్యయనంలో సోంపులోని కొన్ని రకాల లక్షణాలు పేగు సంబంధిత సమస్యను తగ్గిస్తాయని రుజువైంది.
గుండెల్లో మంట :
మెంతులలో ఫైబర్, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఇవి పేగులను బాగా శుభ్రపరుస్తాయి. ఒక అధ్యయనం ప్రకారం, మెంతి గింజల నీరు గుండెల్లో మంట సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి.
చెడు కొలెస్ట్రాల్:
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం వల్ల కూడా అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఈ కొలెస్ట్రాల్ రక్త నాళాలలో పేరుకుపోయి జీర్ణ ప్రక్రియను ప్రభావితం చేయడం ప్రారంభిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. కానీ చెడు కొలెస్ట్రాల్ ఈ ప్రక్రియకు అంతరాయం కలిగిస్తుంది. సోంపు , మెంతి గింజల నీరు కూడా ఈ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇది కడుపు , గుండె రెండింటినీ ఆరోగ్యంగా ఉంచుతుంది.
బరువు తగ్గడం:
సోంపు , మెంతి గింజల నీటిని తాగడం ద్వారా మీరు సులభంగా బరువు తగ్గవచ్చు. ఈ రెండూ జీవక్రియను మెరుగుపరుస్తాయి. అంతే కాకుండా అవి శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చేస్తాయి. దీని కారణంగా మీ బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇదే ఆకలిని కూడా నియంత్రిస్తుంది. ఫలితంగా కేలరీల తీసుకోవడం తగ్గుతుంది.
Also Read: ఓ మై గాడ్.. 30 రోజులు టీ తాగకపోతే.. ఇన్ని లాభాలా ?
సోంపు , మెంతి గింజల నీటిని తయారు చేయడం చాలా సులభం. దీని కోసం, ఒక పాన్ లో ఒక గ్లాసు నీరు తీసుకోండి. దానికి 1 టీస్పూన్ సోంపు , 1 టీస్పూన్ మెంతులు కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మరిగించాలి. నీరు సగానికి తగ్గినప్పుడు, మీరు గోరువెచ్చని నీరు తాగండి. మీకు కావాలంటే.. మీరు దానికి సగం నిమ్మకాయ రసం , తేనె కూడా జోడించవచ్చు. ఈ నీటిని ప్రతి రోజు ఉదయం తాగడం ప్రయోజనకరంగా ఉంటుంది.