Group-2 Certificate Verification: ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. నేటి నుంచి వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా.. ఈ కొందరు అభ్యర్థులు అటెండ్ అయ్యారు. ఏప్రిల్ 10, 11, 15, 16, 17 తేదీల్లో ఆయా అభ్యర్థులు వెరిఫికేషన్ కు హాజరుకావాలని ఏపీపీఎస్సీ తెలిపింది. నిర్ణయించిన తేదీల్లో అంటెండై వారి సర్టిఫికెట్స్ ను వెరిఫై చేసుకోవాలని చెప్పారు. ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు ఎంపికైన అభ్యర్థులు హాల్ టికెట్ నెంబర్లను ఇప్పటికే ఏపీపీఎస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 ఫలితాలు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. స్పోర్ట్స్ సహా సాధారణ కోటాతో కలిపి మొత్తం 2,517 మంది అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు సెలెక్ట్ అయ్యారు. వారి జాబితాను అధికారులు అఫీషియల్ వెబ్ సైట్ లో ఉంచారు. అయితే ఎవరు ఏ రోజు హాజరుకావాలనే విషయాన్ని ఏపీపీఎస్సీ ఇప్పటికే ప్రకటించింది. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్ల వివరాలను కూడా అధికారులు పేర్కొన్నారు.
సర్టిఫికెట్ పరిశీలన అనంతరం ఫైనల్ లిస్ట్ ను ప్రకటిస్తారు. అభ్యర్థులకు తీసుకురావాల్సిన సర్టిఫికెట్స్ గురించి ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్ సైట్ లో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. గ్రూప్-2 పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులు చెక్ లిస్ట్ తో పాటు ఇతర వివరాలను వెబ్ సైట్ లో పొందుపరిచింది. ఈ ఫామ్ లు అన్నింటిని ఏపీపీఎస్సీ వెబ్ సైట్ నుంచే డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
కావాల్సిన సర్టిఫికెట్స్: టెన్త్ మోమో, ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికెట్, టెక్నికల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్, స్టడీ సర్టిఫికెట్స్, ఉన్నత విద్యకు సంబంధించిన సర్టిఫికెట్స్, క్యాస్ట్ సర్టిఫికెట్ (ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఓన్లీ), నాన్ క్రిమీ లేయర్ ( బీసీ వారికి ఓన్లీ), ఇన్ కామ్ సర్టిఫికెట్, అసెట్ సర్టిఫికెట్ (ఈడబ్ల్యూఎస్ వారికి మాత్రమే)
గ్రూప్-2 ఉద్యోగ నియామకాల్లో రోస్టర్ పాయింట్ల అంశంపై హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. హైకోర్టు తుది తీర్పుకు లోబడి ఫైనల్ సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుందని అధికారులు చెప్పారు.
ఇది కూడా చదవండి: ADA Recruitment: ఆన్‌లైన్ ఇంటర్వ్యూతో ఉద్యోగం భయ్యా.. ఈ జాబ్ మీకు వస్తే జీతం రూ.1,00,000కు పైనే..
ఇది కూడా చదవండి: NTPC Recruitment: డిగ్రీతో ఎన్టీపీసీలో ఉద్యోగాలు.. జీతమైతే రూ.71,000, మరి ఇంకెందుకు ఆలస్యం..!