BigTV English

Honey and Garlic: వెల్లుల్లి రెబ్బను తేనెలో ముంచి తినాలా? ఎందుకు?

Honey and Garlic: వెల్లుల్లి రెబ్బను తేనెలో ముంచి తినాలా? ఎందుకు?

వెల్లుల్లి, తేనే… రెండూ కూడా ఆరోగ్యానికి మేలు చేసేవే. అయితే వెల్లుల్లి రుచి నచ్చక ఎంతో మంది తినరు. నిజానికి వెల్లుల్లి రుచిపరంగా బాగోకపోయినా, ఆరోగ్యపరంగా ఎంతో ఉన్నతమైనది. ప్రతిరోజూ తేనెలో ఒక వెల్లుల్లి రెబ్బలు ముంచి నానబెట్టిన తర్వాత తినేందుకు ప్రయత్నించండి. ఇది మీకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ప్రతిరోజూ ఇలా తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకోండి.


వెల్లుల్లితో ఆరోగ్యం
వెల్లుల్లి ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందింది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. రక్త పోటును అదుపులో ఉంచడానికి కూడా సహాయపడుతుంది. తేనెలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటుంది. గొంతు నొప్పికి ఉపశమనం కలిగిస్తుంది. యాంటీ బ్యాక్టీరియా లక్షణాలకు ఇది ప్రసిద్ధి చెందింది. కాబట్టి తేనె, వెల్లుల్లి రెండూ కలిపితే ఆరోగ్యానికి సహాయ పడే సూపర్ ఫుడ్ గా మారిపోతుంది.

రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంలో వెల్లుల్లి, తేనే రెండు అద్భుతంగా పనిచేస్తాయి. తేనెలో ముంచిన వెల్లుల్లిని ప్రతిరోజు ఒకటి తినండి చాలు. అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు శరీరానికి రక్షణ వ్యవస్థను కల్పిస్తాయి. వెల్లుల్లిలో అలిసిన్ ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు సహాయపడే సమ్మేళనం తేనే. శతాబ్దాలుగా గాయాలు, గొంతు నొప్పికి చికిత్స చేయడానికి ఉపయోగపడుతుంది. రోగనిరోధక వ్యవస్థను బలాపేతం చేయడంలో కూడా తేనె, వెల్లుల్లి రెండే కలిసి అద్భుతంగా పనిచేస్తాయి.


జలుబు, దగ్గుకు సహజ నివారణలుగా కూడా తేనె వెల్లుల్లి పనిచేస్తాయి. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయని ముందే చెప్పుకున్నాం. ఇవి ఇన్ఫెక్షన్లతో పోరాడుతాయి. ఇక తేనే గొంతుకు ఉపశమనం కలిగిస్తుంది. చికాకు, దగ్గును తగ్గిస్తుంది. కాబట్టి ఒక చెంచా తేనెలో వెల్లుల్లి ముంచి అలాగే నోట్లో పెట్టుకుని నమిలేయండి. తేనెలోని తీయదనం, వెల్లుల్లిలోని మంట కలిసి అద్భుతంగా పనిచేస్తాయి.

గుండె ఆరోగ్యానికి
వెల్లుల్లి గుండె ఆరోగ్యంపై ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అదే అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. శరీరానికి రక్తప్రసరణ పెంచుతుంది. తేనె తీపిగా ఉన్నప్పటికీ కొన్ని ఆశ్చర్యకరమైన ప్రయోజనాలను గుండెకు అందిస్తుంది. ఇవి రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. వెల్లుల్లి, తేనే కలిసే ఆరోగ్యకరమైన గుండెను అందిస్తాయి.

Also Read: తడి జుట్టును దువ్వితే.. జుట్టు రాలిపోతుందా?

జీర్ణ సమస్యలతో మీరు ఇబ్బంది పడుతూ ఉంటే తేనెలో ముంచిన వెల్లుల్లి మీకు ఎంత సహాయపడుతుంది. వెల్లుల్లిలో ప్రీబయోటిక్ ప్రభావాలు అధికంగా ఉంటాయి. ఇది పేగులో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయపడుతుంది. తేనెలో జీర్ణక్రియకు సహాయపడే ఉబ్బరం తగ్గించే లక్షణాలు ఉంటాయి. కాబట్టి జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచేందుకు కూడా ఈ వెల్లుల్లి, తేనే మిశ్రమం ఎంతో ఉపయోగపడుతుంది.

ప్రతిరోజూ ఉదయం పరగడుపునే తేనెలో ముంచి వెల్లుల్లి తినడం అలవాటుగా మార్చుకోండి. నెల రోజుల్లో మీకు ఎంతో మార్పు కనిపిస్తుంది. ఖాళీ పొట్టతో వీటిని తినడం వల్ల ఉపయోగం ఉంటుంది.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×