Rashmika Mandanna: నేషనల్ రష్మిక మందన్న (Rashmika Mandanna)ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఒకవైపు పాన్ ఇండియా సినిమాలతో పాటు మరోవైపు బాలీవుడ్ సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటూ కెరియర్ పరంగా ఏమాత్రం తీరిక లేకుండా గడుపుతున్నారు. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైన రష్మిక అనంతరం తెలుగులో సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇక తెలుగులో కూడా వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న ఈమెకు పుష్ప సినిమా మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చింది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావడంతో రష్మికకు పాన్ ఇండియా స్థాయిలో అదే ఆదరణ లభించింది.
ఇలా పుష్ప సినిమా మంచి సక్సెస్ అయిన నేపథ్యంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈమెకు అవకాశాలు వచ్చాయి. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో యానిమల్ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న రష్మిక ఇటీవల ఛావా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇక పుష్ప 2 కూడా ఇండస్ట్రీ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇలా రష్మిక బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలలో నటిస్తున్న నేపథ్యంలో ఈమె రెమ్యూనరేషన్ కూడా అదే స్థాయిలో ఉందని తెలుస్తోంది. ఒక్కో సినిమాకు దాదాపు 8 నుంచి 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
సరదాగా రష్మిక పాత్ర…
తాజాగా రష్మిక మందన్న కుబేర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Danush), రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా జూన్ 20వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను వేగవంతం చేస్తున్నారు తాజాగా చిత్ర బృందం ముంబైలో ఈ సినిమా నుంచి థర్డ్ సింగిల్ విడుదల చేస్తూ ఒక ఈ వెంట నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా అక్కినేని నాగార్జున(Nagarjuna) పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో రష్మిక గురించి ఆమె నటన గురించి ఎంతో అద్భుతంగా వర్ణించారు. ఈ సినిమా డబ్బింగ్ చెప్పేటప్పుడు తాను సినిమా చూసానని, రష్మిక పాత్ర అద్భుతంగా ఉంటుందని ఆమె పాత్ర చూడగానే ప్రతి ఒక్కరూ నవ్వుకుంటారు అంటూ నాగార్జున రష్మిక గురించి తెలిపారు.
వేలకోట్ల రూపాయలు …
ఇక ఇదివరకే రష్మిక నాగార్జున నటించిన విషయం తెలిసిందే. నాని రష్మిక హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన దేవదాస్ అనే సినిమాలో కూడా నాగార్జున నటించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా నాగార్జున మాట్లాడుతూ రష్మిక గత మూడు సంవత్సరాల నుంచి సినిమాలు చేస్తూ భారీగా సంపాదించిందని, గత మూడు సంవత్సరాల నుంచి రష్మిక ఏకంగా రెండు మూడు వేల కోట్ల రూపాయల సినిమాలు చేసిందని మనలో ఎవరూ కూడా ఆ స్థాయిలో సినిమాలు చేయలేదు అంటూ నాగార్జున తెలియజేశారు. అయితే రష్మిక ఇప్పటివరకు నటించిన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ సినిమాలన్నీ కూడా వేల కోట్లలో కలెక్షన్లను రాబట్టిన సంగతి తెలిసిందే.