Indian Navy: ఇంటర్ పాసైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. భారత నావికాదళంలో 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇంటర్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ తో ఇంటర్ పూర్తి చేసి జేఈఈ మెయిన్స్ పరీక్ష రాసిన వారికి ఇది సువర్ణవకాశం. దీనికి సంబంధించిన విద్యార్హతలు, పోస్టులు వివరాలు, వయస్సు, ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు విధానం, తదితర వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇండియన్ నేవీ జనవరి 2026 బ్యాచ్ కోసం 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఇది నాలుగేళ్ల బీటెక్ డిగ్రీని అందజేస్తుంది. ఇండియన్ నేవీలో ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ బ్రాంచ్ లలో కమిషన్డ్ ఆఫీసర్ గా మారేందుకు ఈ కోర్సు ఉపయోగపడుతుంది. జులై 14న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
స్కీమ్ పేరు: ఇండియన్ నేవీ 10+2 క్యాడెట్ ఎంట్రీ
మొత్తం వెకెన్సీల సంఖ్య: 44
నియామక సంస్థ: ఇండియన్ నేవీ
ఉద్యోగం ప్లేస్: ఇండియన్ నావల్ అకాడమీ,ఎజిమల.. నియామకం తర్వాత దేశంలో పలు నావల్ బేస్ లలో పనిచేయాల్సి ఉంటుంది.
ఇందులో ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
విద్యార్హత: ఇంటర్ లో 70 శాతం మార్కులు వచ్చి ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులు ఉండాలి. టెన్త్ లో లేదా ఇంటర్ లో ఇంగ్లిష్ లో మినిమమ్ 50 శాతం మార్కులు ఉండాలి.
వయస్సు: అభ్యర్థులు 2006 జులై 2 నుంచి 2009 జనవరి 1 మధ్య జన్మించి ఉండాదలి.
నిబంధనలు: అవివాహిత పురుషడు, అవివాహిత మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. నాలుగేళ్ల ట్రైనింగ్ పీరియడ్ లో అభ్యర్థులు పెళ్లి చేసుకోరాదు.
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 జూన్ 30
దరఖాస్తుకు చివరి తేది: 2025 జులై 14
ఇంటర్వ్యూ తేదీ: 2025 సెప్టెంబర్
స్టైఫండ్: నాలుగేళ్ల శిక్షణ కాలంలో స్టైఫండ్ అందజేస్తారు. ట్రైనింగ్ అనంతరం సబ్ లెఫ్టినెంట్ గా ప్రమోషన్ ఉంటుంది. స్టైఫండ్ రూ.56,100 నుంచి రూ.1,77,500 ఉంటుంది. అదనంగా నెలకు రూ.15,500 మిలిటరీ సర్వీస్ పే వర్తిస్తుంది.
బీమా కవరేజ్: అన్ని క్యాడెట్ లు, అధికారులకు రూ.కోటి బీమా కవరేజ్ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.joinindiannavy.gov.in/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారికి ఇది మంచి అవకాశం. సెలెక్ట్ అయిన వారికి బంగారు భవిష్యత్తు ఉంటుంది. నెలకు స్టైఫండ్ కూడా అందజేస్తారు. రూ.56వేల నుంచి రూ.1,77,500 వరకు జీత భత్యాలు ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం. అర్హతలు ఉన్న వారు వెంటనే అప్లై చేసుకోండి. స్కీంకు సెలక్ట్ అవ్వండి. ఆల్ ది బెస్ట్.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం వెకెన్సీల సంఖ్య: 44
దరఖాస్తుకు చివరి తేది: 2025 జులై 14
ALSO READ: BHEL Jobs: పది, ఐటీఐతో 515 ఉద్యోగాలు.. సింపుల్ ప్రాసెస్.. జాబ్ వస్తే రూ.65వేల జీతం భయ్యా